ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్స్..! కావాల్సినంత సెంటిమెంట్ రాజకీయం..!!

టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. మహానటి బిగ్ సక్సెస్ తర్వాత… ఇప్పుడు రెండు బయోపిక్‌లు… హాట్ టాపిక్‌ అవుతున్నాయి. ఈ రెండు ఒక్క సినీ రంగంలోనే కాదు… రాజకీయాల్లోనూ.. సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒకటి యుగపురుషుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ” ఎన్టీఆర్ ” కాగా.. మరొకటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ “యాత్ర”. ఈ రెండు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మూల పురుషులుగా ప్రచారం చేసుకుంటున్నవారి జీవిత చరిత్రలు కావడమే అసలు రాజకీయ కోణానికి కారణం. ఈ రెండు సినిమాల యూనిట్లు ఫస్ట్‌ లుక్, టీజర్ల విషయంలో పోటీ పడుతున్నాయి. క్వాలిటీలో ఎక్కడా రాజకీ పడటం లేదు. సినిమాలను కూడా… ఎన్నికలకు ముందే దాదాపుగా ఒకే సమయంలో విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నామని.. బాలకృష్ణ… గౌతమిపుత్రశాతకర్ణి సమయంలోనే ప్రకటించారు. అనేక రకాల కసరత్తులు జరిగి చివరికి నిన్న అంటే.. జూలై ఐదో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. దర్శకుడు క్రిష్ కాబట్టి…దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. సూపర్ స్టార్లు, టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించడానికి అంగీకరించారు. కథ విషయంలో క్లారిటీ రాకపోయినా.. ఎన్టీఆర్ జీవితంలో రాజకీయానిదే కీలక ఘట్టం. ఆయన రాజకీయాల్లో ప్రజల మనసుల్ని ఎలా గెలుచుకున్నారనే అసలైన క్లైమాక్స్ కావొచ్చు. ఇది ప్రజల్ని మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు. అందుకే ఎన్నికలకు ముందు అంటే జనవరిలో విడుదల చేయాలని ఇప్పటికే డిసైడయ్యారు.

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ “యాత్ర” కూడా.. ఈ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. వైఎస్‌ను మమ్ముట్టి దించేయడంతో… అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో… వైఎస్ జీవిత చరిత్ర అంతా ఉండే అవకాశం లేదు. ఆయన పాదయాత్ర ఎలా ప్రజల్లోకి వెళ్లింది అన్నదాన్ని మాత్రమే చెప్పనున్నారు. ఓ రకంగా చూస్తే… ఇది పూర్తిగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి … పాదయాత్రను ప్రజలకు మరోసారి గుర్తు చేసి.. సెంటిమెంట్‌ను పండించే ప్రయత్నంగానే చెప్పుకోవచ్చు. ఈ సినిమా విడుదల.. కూడా జనవరిలోనే… ఉంటుందంటున్నారు. జూలై ఎనిమిదో తేదీన టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.

పోటాపోటీగా రూపొందుతున్న రెండు పార్టీల మూల పురుషుల బయోపిక్‌లు.. ప్రజలను ఎన్నికల సమయంలో మరింత భావోద్వేగానికి గురి చేయనున్నాయి. ఈ సినిమాలను జనవరిలో విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నా… కచ్చితంగా .. వాటి రిలీజ్ డేట్లు మాత్రం.. ఎన్నికలకు కొద్దిగా ముందుగానే ఉంటాయి. అంటే… ఎన్నికల తేదీలను బట్టి.. ఈ సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close