జగన్ రెడ్డి కోసం ఎన్టీవీ యజమానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని చెప్పడానికి ఆయనకు మనసు రావడం లేదు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ అనే పేర్లే మన చానల్లో వినిపించకూడదని కట్టుబాటు పెట్టిన ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరిస్తూ బురతచల్లేయడానికి తన సిబ్బందికి ప్రత్యేకమైన ఆదేశాలిస్తున్నారు. అవి కేసులకు కారణం అవుతున్నాయి.
తాజాగా గిరిజన సంక్షేమ శాఖలో ఓ అధికారి ఏసీబీకి పట్టుబడితే.. వెంటనే మంత్రే అవినీతి చేసినట్లుగా కథనాలు రాసేశారు. కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన గుమ్మడి సంధ్యారాణి ఇలా ..తనపై నిందలు వేస్తే వివరణ ఇచ్చుకోవాలని అనుకోవడం లేదు. సరైన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. తనపై చేసి ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చట్టపరమైన శిక్షలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఒక్క సంధ్యారాణి కాదు.. ఎన్టీవీ గత కొంతకాలంగా ఒకే ఫార్ములాతో.. ప్రతి ఒక్క కూటమి ఎమ్మెల్యేపై అవినీతి మరకలు పోస్తూ పోతోంది. ఓ ప్రణాళికాబద్దమైన వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
ఇటీవల గోదావరి జిల్లాలో కొంత మంది స్ట్రింగర్లు ఓ మహిళను .. బెదిరించి డబ్బులు వసూలు చేశారు. లేకపోతే వ్యభిచారం చేస్తున్నారని కథనాలు రాస్తామని బెదిరించారని కేసు నమోదు అయింది. అందులో అన్ని ప్రముఖ చానళ్ల జర్నలిస్టులు ఉన్నారు. మరి ఎన్టీవీ స్ట్రింగర్ కూడా ఇందులో ఉంటే.. నేరుగా ఎన్టీవీ నరేంద్రనాథ చౌదరినే ఇలా చేయించి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులు కేసులు పెట్టవచ్చా ?. పోలీసులు కేసులు పెట్టలేరు..కానీ మీడియా మాత్రం.. కింది స్థాయి వాళ్లు దొరికితే.. నేరుగా మంత్రికి లింకులు పెట్టి కథనాలు రాసి.. తాము సపోర్టు చేసే దోపిడీ లీడర్లకు మేలు చేయాలనుకుంటారు. ఇలాంటి వారికి.. తాము నిందలు వేసే వారికి కూడా హక్కులు ఉంటాయని నిరూపించకపోతే.. .ఇంకా ఇంకా ఎక్కువ బురద చల్లేస్తారు. అది తుడుచుకోలేనంతగా పెరిగిపోతుంది