కర్ణాటక పోలీసు శాఖలో అత్యున్నత స్థాయి అధికారి, డీజీపీ డాక్టర్ రామచంద్రరావుకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విధుల్లో ఉండగా, ఏకంగా తన అధికారిక ఛాంబర్లోనే యూనిఫాంతో ఉన్న సమయంలోనే ఆయన పలువురు మహిళలతో సన్నిహితంగా గడిపిన దృశ్యాలు ఈ వీడియోలలో బయటపడ్డాయి. అత్యంత క్రమశిక్షణతో మెలగాల్సిన ఉన్నతాధికారి కార్యాలయంలోనే ఇలాంటి రాసలీలలకు పాల్పడటం పోలీసు వర్గాల్లో , ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో, అందులోనూ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై ఆయన ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరారు. ప్రభుత్వంపై విపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హోం శాఖను సీఎం ఆదేశించారు. ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవని, తనను లక్ష్యంగా చేసుకుని ఎవరో కుట్ర పన్నారని డీజీపీ రామచంద్రరావు వాదిస్తున్నారు.
ఈ వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకోవడానికి మరో కారణం ఆయన కుటుంబ నేపథ్యం. డీజీపీ రామచంద్రరావు మరెవరో కాదు, కన్నడ నటి రన్యా రావు తండ్రి . గతంలో రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో కూడా రామచంద్రరావు పేరు మారుమోగింది. ఆ సమయంలో ప్రభుత్వం ఆయన్ని తప్పనిసరి సెలవుపై పంపింది. ఇప్పుడు మళ్ళీ ఈ రాసలీలల వీడియో బయటకు రావడంతో, ఆయన కెరీర్ మరోసారి చిక్కుల్లో పడింది.
