విజ‌య్ దేవ‌ర‌కొండ సోదరుడికి మ‌రో ఆఫ‌ర్‌

అర్జున్ రెడ్డితో స్టార్ అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు విజ‌య్ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా హీరో అయిపోయాడు. `దొర‌సాని`తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. శుక్ర‌వారం ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేస్తున్నారు. ఆ సినిమా విడుల‌కు ముందే ఆనంద్ మ‌రో ఆఫ‌ర్ కొట్టేశాడు. మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌తోనే మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడిప్పుడు. ఈ చిత్రానికి ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ప్రేమ ఇష్క్ కాద‌ల్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్నాడు ప‌వ‌న్ సాదినేని. `సావిత్రి` సినిమా ఫ్లాప్ అయ్యింది. మ‌ధుర శ్రీధ‌ర్ తీసిన `ఏబీసీడీ`కి ప‌వ‌న్ స‌హాయ స‌హ‌కారాలు అందించాడు. ఇప్పుడు ప‌వ‌న్‌ని మ‌రో అవ‌కాశం ఇచ్చాడు మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com