సీత‌… `సీత‌` క్యారెక్ట‌ర్‌ని దెబ్బ‌తీసేలా ఉందా?

పురాణ పాత్ర‌ల్ని, పేర్ల‌నీ, వాడుకునేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా – మ‌త సంఘాల నుంచి విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సివ‌స్తుంది. సినిమా విడుద‌ల‌కు ముందు అనుకోని అవాంత‌రాల‌ని ఎదుర్కోవాల్సివుంటుంది. ప్ర‌స్తుతం ‘సీత‌’ కూడా అలాంటి స‌మ‌స్య‌నే ఎదుర్కొంటోంది. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘సీత‌’. కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల‌కు స్పీడ్ బ్రేక‌ర్లు ప‌డ్డాయి.

సీత సినిమాలోని కొన్ని డైలాగులు, స‌న్నివేశాలు పురాణాల్ని, హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఉంద‌ని బీజేవైఎమ్ సంస్థ ఆరోపిస్తోంది. హిందూమ‌తాన్ని, సంప్ర‌దాయాల్ని ప్ర‌చారం చేసే బీజేవైఎమ్‌.. ‘సీత‌’పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ సినిమాని నిషేధించాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకొనేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాల‌ని కోరుకుంటోంది. సెన్సార్ బోర్డు అనుమ‌తి ఇచ్చాక‌.. ఓ సినిమాని అడ్డుకునే హ‌క్కు ఎవ‌రికీ లేదు. `సీత` విడుద‌ల విష‌యంలో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాక‌పోవొచ్చు. కానీ… ఇలాంటి వివాదాలు చిత్ర‌బృందానికి కొత్త త‌ల‌నొప్పులు తీసుకొస్తాయి. ‘సీత‌’ ట్రైల‌ర్లోనే సీత‌గా కాజ‌ల్ పాత్ర‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు తేజ‌. డ‌బ్బుల కోసం ప‌డ‌క కూడా పంచుకోవ‌డానికి సిద్ధ‌ప‌డే అమ్మాయిగా కాజ‌ల్ పాత్ర‌ని తీర్చిదిద్దారు. ఆ పాత్ర‌కు సీత అనే పేరు పెట్ట‌డ‌మే ఇబ్బందిగా మారింది. ఇప్పటికిప్పుడు టైటిల్ మార్చ‌డం కుద‌ర‌ని ప‌ని. సినిమాలో కాజ‌ల్ పేరు మార్చ‌డం అంత‌కంటే క‌ష్టం. మ‌రి దీనిపై చిత్ర‌బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close