తెలంగాణాలో ప్రతిపక్షాల గోడు అరణ్యరోదనే

తెరాసలో చేరిన 12మంది తెదేపా ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకొని వారిని తెరాస సభ్యులుగా గుర్తిస్తూ తెలంగాణా స్పీకర్ మధుసూధనా చారి తీసుకొన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అన్నీ తప్పుపట్టాయి. తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసుని సుప్రీం కోర్టు విచారిస్తున్నపుడు స్పీకర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్దం. వారిపై అనర్హత వేయాలని కోరుతూ మేము ఇచ్చిన లేఖలను పట్టించుకోకుండా, నిన్నగాక మొన్న మాపార్టీలో నుంచి తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై అంత హడావుడిగా ఎందుకు నిర్ణయం తీసుకొన్నారని రేవంత్ రెడ్డి స్పీకర్ మధుసూధనా చారిని ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకొంటోంది. రాష్ట్రంలో ఇటువంటి వికృత రాజకీయ సంస్కృతిని నెలకొని ఉండటం చాలా దురదృష్టకరం,” అని అన్నారు.

కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి కూడా స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని కోరుతూ మేము ఇచ్చిన వినతి పత్రాలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా తెదేపా ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం చాలా తప్పు. అది రాజ్యాంగ విరుద్ధం కనుక ఆయన నిర్ణయాన్ని న్యాయస్థానాలు కూడా ఆమోదించకపోవచ్చును.

చేతిలో అధికారం ఉంది కదా అని తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాలను ఈవిధంగా బలహీనపరిచి వాటి గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూదదనుకోవడం అప్రజాస్వామికం. అటువంటి ఆలోచనలను, ప్రయత్నాలను ప్రజలు ఎన్నడూ ఆమోదించరు. తగిన సమయం వచ్చినప్పుడు తెరాసకు ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు. రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయగలమనుకోవడం అవివేకం. కాంగ్రెస్ పార్టీని ఎంతగా అణగద్రొక్కాలని చూస్తే అది మరింత బలంగా పైకి లేస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇటువంటి పోకడలున్న పార్టీ అధికారంలోకి రావడం, ఇటువంటి రాజకీయ వాతావరణం నెలకొల్పడం చాలా బాధ కలిగిస్తోంది. శాసనసభలో తెరాస అనుసరిస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాల గురించి గట్టిగా నిలదీస్తాము,” అని జానారెడ్డి అన్నారు.

ప్రతిపక్షాల ఆవేదన చాలా సహేతుకమయినదే కానీ కేసీఆర్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే నేతిబీరకాయలో నెయ్యి వంటిది లేదా పులిహోరలో కరివేపాకు వంటిందని చెప్పవచ్చును. అందుకే దానిని ఎన్నికల కోసం మాత్రమే వినియోగించుకొని మిగిలిన సమయంలో తనదైన శైలిలో పనిచేసుకొని పోతుంటారు. కనుక ప్రతిపక్షాల ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close