ఆ ఒక్కటీ తప్ప అన్నీ యధావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల మధ్య ఇస్లామాబాద్ లో జరుగవలసిన సమావేశం నిరవదికంగా వాయిదా పడింది. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన వారిని పట్టుకొని శిక్షించే వరకు పాక్ తో చర్చలు అసాధ్యం అన్నట్లుగా భారత్ తేల్చి చెప్పింది. కానీ ఆ ఒక్క సమావేశం తప్ప మిగిలినవన్నీ యధాప్రకారం జరిగిపోతున్నట్లే ఉన్నాయి. భారత్-పాక్ క్రికెట్ జట్లు శనివారంనాడు కోల్ కతాలో మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నాయి.

ఈలోగా భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం నేపాల్ లో జరుగుతున్న సార్క్ దేశాల సమావేశాలలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో ఇవ్వాళ్ళ 20 నిమిషాల సేపు చర్చలు జరిపారు. మళ్ళీ ఈ ఏడాది నవంబర్ 9,10 తేదీలలో పాకిస్తాన్ లో జరుగబోయే సార్క్ దేశాల సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడిని ఆహ్వానిస్తూ సర్తాజ్ అజీజ్ అందించిన ఆహ్వానపత్రాన్ని సుష్మా స్వరాజ్ చాలా ఆనందంగా స్వీకరించారు. పఠాన్ కోట్ దాడులపై పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం పఠాన్ కోట్ లో కూడా దర్యాప్తు చేసేందుకు ఈనెల 27న భారత్ కి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆ తరువాత మీడియా సర్తాజ్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ మార్చి నెలాఖరున అమెరికాలో జరుగబోయే అణుభద్రత సమావేశాలలో భారత్-పాక్ దేశాల ప్రధానులు కలిసి మాట్లాడుకొంటారని ప్రకటించినపుడు పక్కనే ఉన్న సుష్మా స్వరాజ్ దానిని ఆమోదిస్తున్నట్లు తల ఊపారు.

అంటే ఒక్క భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం’ తప్ప మిగిలినవన్నీ యధాప్రకారంగానే జరిగిపోతున్నాయని స్పష్టం అవుతోంది. అంటే ఇరుదేశాల మధ్య పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నట్లు అర్ధమవుతోంది. అది ఆహ్వానించదగ్గ పరిణామమే. అటువంటప్పుడు భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం నిర్వహించడానికి మాత్రం భారత్ ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నట్లో అర్ధం కాదు.

తెర వెనుక ఇన్ని సమావేశాలు నిర్వహించుకొంటునప్పుడు, బహిరంగంగా క్రికెట్ మ్యాచులు ఆడుకొంటునప్పుడు, పఠాన్ కోట్ పై జరిగిన దాడికి నిరసనగానే విదేశాంగ కార్యదర్శుల సమావేశం వాయిదా వేసుకొంటున్నామని చెప్పదలిస్తే అది ఆత్మవంచన చేసుకోవడంగానే భావించాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వానికి అసలు సరయిన విదేశీ విధానమే లేదని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆరోపణలు చేస్తునందున్న వాటి నోటికి భయపడే విదేశాంగ కార్యదర్శుల సమావేశం వాయిదా వేసుకొంటోందేమోననే అనుమానం కూడా కలుగుతోంది. లేకుంటే షెడ్యూల్ ప్రకారం సమావేశం జరిగి ఉండేదేమో?

మరో సందేహం ఏమిటంటే, కోల్ కతాలో జరుగబోయే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు పాక్ నుంచి బయలుదేరాలనుకొన్న ఏడుగురు పాక్ దౌత్యవేత్తలు పాక్ గూడచారి సంస్థ ఐ.ఎస్.ఐ.కి చెందినవారనే అనుమానంతో వారికి అనుమతి నిరాకరించినపుడు, మరి ఐ.ఎస్.ఐ.కే చెందిన ఒక ఉన్నతాధికారితో కూడిన దర్యాప్తు బృందాన్ని భారత్ లో పర్యటించేందుకు ఎందుకు అనుమతిస్తున్నట్లు? భారత్ కి అత్యంత కీలకమయిన, చాలా వ్యూహాత్మకమయిన వైమానిక స్థావరంగా పేరున్న పఠాన్ కోట్ లో వారిని ఎందుకు అడుగు పెట్టనిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పాక్ పట్ల భారత్ సానుకూల వైఖరి ప్రదర్శించడం హర్షణీయమే, స్వాగతించదగ్గదే కానీ ఇటువంటి అనిశ్చిత, అయోమయ వైఖరిని అవలంభించడమే చాలా తప్పని చెప్పకతప్పదు. దాని వలన మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలకే కాదు ప్రపంచదేశాల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close