చైతూ.. మ‌రీ ఇంత రిస్కా??

చేతిలో ఓ హిట్టున్న ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌డానికి హీరోలు నానా ర‌కాలుగా ఆలోచిస్తున్నారు. హిట్టు సినిమా తీయ‌గ‌ల‌డు.. అన్న న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప బ‌రిలోకి దిగ‌డం లేదు. వ‌రుస హిట్లున్న హీరోలే ఇలా ఆలోచిస్తుంటే, కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకుండా న‌త్త న‌డ‌క న‌డుస్తున్న నాగ‌చైత‌న్య ఇంకెంత ఆలోచించాలి? ఇంకెంత ప‌క‌డ్బందీగా ద‌ర్శ‌కుల‌ను ఎంచుకోవాలి? అయితే… మ‌రోసారి నాగ‌చైత‌న్య గుడ్డిగా అడుగులు వేస్తున్నాడు. ఓ ఫ్లాప్ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు.

అత‌నెవ‌రో కాదు.. ర‌మేష్ వ‌ర్మ‌. ఒక ఊరిలో సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లెట్టాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ర‌వితేజ‌తో తీసిన వీర కూడా అంతంత మాత్ర‌మే. మొన్నామ‌ధ్య నాగ‌శౌర్య‌కీ ఓ అట్ట‌ర్ ఫ్లాప్ ఇచ్చాడు. అలాంటి ర‌మేష్ వ‌ర్మ క‌థ‌కు నాగ‌చైత‌న్య బౌల్డ్ అయిపోయాడ‌ట‌. అన్న‌పూర్ణ కాంపౌండ్ హీరోల‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో భారీ స్కెచ్చులు రెడీ చేసుకొంటున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఇప్పుడు ర‌మేష్ దాటికి నాగ‌చైత‌న్య ప‌డిపోయాడు. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. తెలిసి తెలిసి చైతూ ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close