ఒకే బాటలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్!?

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జగన్ ఏర్పాటు చేసిన వైసీపీని, పిల్ల కాంగ్రెస్ అని ఆ మధ్య చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన అనేక కొత్త కాంగ్రెస్ లలో ఇదీ ఒకటి. అయితే తృణమూల్ కాంగ్రెస్ మినహా మరే కొత్త కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ అధికారంలోకి రాలేకపోయింది.

ఇప్పుడు రెండు పార్టీలూ చాలా విషయాల్లో ఒకేలా ప్రవర్తిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో రెండింటికీ పెద్ద షాక్ తగిలింది. అధికారం ఖాయమని లెక్కలు వేసిన జగన్, ఫలితాలతో కంగుతిన్నారు. మరో ఐదేళ్లు ఆగాల్సి రావడం ఆయనకు చాలా కష్టంగా మారింది. పదేళ్ల యూపీఏ ప్రభుత్వానికి దేశ ప్రజలు భారీ షాకివ్వడంతో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. కేవలం 44 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక చట్ట సభల్లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో ఈ రెండు పార్టీలూ తడబడుతూ తప్పటడుగులు వేస్తున్నాయి. ప్రతి విషయాన్ని వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతి విషయానికీ ప్రభుత్వాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర పడలేదు. రాజ్యసభలో కాంగ్రెస్ దే రాజ్యం. దానికి ఇష్టం లేకపోతే ఎజెండాలో ఉన్న అంశాలన్ని టేబుల్ చేయడానకి కూడా అవకాశం ఉండదు. దీనికి చాలా కారణాలున్నాయి. అందుకే లోక్ సభ ఆమోదించిన ఈ బిల్లు రాజ్యసభలో అటకెక్కింది. ఇంకా అనేక అంశాల్లో, చివరకు ఆధార్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చింది. సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలనే సంకల్పాన్ని ఎవరూ తప్పు పుట్టాల్సిన అవసరం లేదు. ఒకే సబ్సిడీని ఒకే వ్యక్తి అనేక సార్లు వాడుకోకుండా చెక్ పెట్టడం మంచిదే. సబ్సిడీలు అర్హులకు, సక్రమగా అందడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ప్రతిపక్షం నిస్సంకోచంగా మద్దతివ్వాలి. కానీ కాంగ్రెస్ మాత్రం ఉభయ సభల్లో గొడవ చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. బయట కూడా ఇదే ధోరణి.

వైసీపీ వ్యవహార శైలీ సేమ్ డిటో. ప్రతి దానికీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కంకణం కట్టుకున్నట్టుంది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ నుంచీ అదే ధోరణి. నిజానికి చాలా మంది రైతులు భూసమీకరణకు అంగీకరించారు. కానీ జగన్ పర్యటనలు మాత్రం రాజధానికి వ్యతిరేకం అన్నట్టు స్పష్టంగా కనిపించాయి. ప్రభుత్వ పథకాల్లో లోపాలుంటే ఎత్తి చూపాలి. అవి సరిగా అమలు చేయడానికి సలహాలివ్వాలి. వైసీపీ మాత్రం తనకు ఎవరిమీదా, ఏ వ్యవస్థ మీదా విశ్వాసం లేనట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వంపై అవిశ్వాసం, స్పీకర్ పై అవిశ్వాసంతో ఏం సాధించిందో అర్థం కాదు. టీడీపీలో చేరిన తన 8 మంది ఎమ్మెల్యేలను విప్ ద్వారా ఇరుకున పెట్టాలని అవిశ్వాసం పేరుతో బ్రహ్మాస్త్రం సంధించామని వైసీపీ నేతలు భావించారేమో. చివరక అధికార పార్టీ వ్యూహంతో అస్త్రం కాస్తా తస్సుమంది.

ఒటమి షాక్ నుంచి కాంగ్రెస్, వైసీపీలు ఇంకా కోలుకున్నట్టు లేదు. ఇప్పటికీ సరైన వ్యూహాలు లేక తడబడుతున్నాయి. అటు రాహుల్, ఇటు జగన్ పరిపక్వత సాధించినట్టు కనిపించదు. పార్టీని ముందుండి నడిపే చతురత వారిలో ఉన్నట్టు లేదు. అయితే, రాహుల్ కనీసం పార్టీ సీనియర్లు ఏదైనా చెప్తే వింటారట. జగన్ మాత్రం తాను చెప్పేదే వినాలనే ధోరణితో ఉంటారన్న విమర్శ ఈనాటిది కాదు. ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా ఇష్టారాజ్యం చెలాయిస్తానంటే పార్టీలు మనుగడ సాగించవు. నాయకుడికి అహంకారం ఎక్కువైందని శ్రేణులు భావిస్తే ఇక ఆ పార్టీ బలం తరిగిపోవడానికి పెద్దగా సమయం పట్టదు. కనీసం భవిష్యత్తులో అయినా ఈ రెండు పార్టీలూ సరైన వ్యూహంతో సభలో వ్యవహరిస్తాయో లేక ఇలాగే తడబడతాయో వేచి చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close