చైతూ, అఖిల్‌.. ఇంకా టైం ఉంద‌ట‌

నాగార్జున ఈ వ‌య‌సులోనూ తెగ రెచ్చిపోతున్నాడు. త‌న కెరీర్‌లో ఇది వ‌ర‌కు లేనంత జోష్.. ఇప్పుడు నాగ్‌లో క‌నిపిస్తోంది. మ‌నం, సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాలో ఆ హుషారు మ‌రింత పెరిగింది. సోగ్గాడే దాదాపు రూ.50 కోట్లు వ‌సూలు చేసి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఊపిరిపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. త‌న కెరీర్ ప‌రంగా నాగ్ కి పూర్తి సంతృప్తి ఉంది. కానీ ఒక‌టే బాధ‌.. వార‌సుల‌కు స‌రైన విజ‌యాలు లేవ‌ని. నాగ‌చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క నికార్స‌యిన హిట్ కూడా కొట్ట‌లేదు. ఎన్నో ఆశ‌లు పెంచుకొని వ‌చ్చిన అఖిల్… తొలి సినిమాకే బొక్క బోర్లాప‌డ్డారు. ఇప్పుడు వీరిద్ద‌రి కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టాల్సిన బాధ్య‌త నాగ్‌దే.

మీరేమో వ‌రుస హిట్లు కొడుతున్నారు, మ‌రి వార‌సుల ఫామ్ క‌ల‌ర‌వ పెట్ట‌డం లేదా? అని అడిగితే నాగ్ ఏం చెప్పాడో తెలుసా? ”వాళ్ల కెరీర్‌పై నాకు అస్స‌లు బెంగ లేదు. వాళ్ల కెరీర్ ఇప్పుడే ప్రారంభ‌మైంది. స్టార్ డ‌మ్ అందుకోవ‌డానికి ఇంకా టైమ్ ఉంది. వాళ్లింకా నేర్చుకొనే ద‌శ‌లోనే ఉన్నారు. ఇప్పుడే అద్భుతాలు సృష్టించాలంటే ఎలా? నాక్కూడా హ‌లో బ్ర‌ద‌ర్ వ‌రకూ స్టార్ డ‌మ్ అంటే ఏంటో తెలీదు. మెల్లి మెల్లిగా వాళ్లూ ఆ స్థాయిని చేరుకొంటారు” అంటూ వార‌సుల‌పై న‌మ్మ‌కం వెలుబుచ్చాడు నాగ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close