పాక్ దర్యాప్తు బృందానికి పఠాన్ కోట్ లోకి అనుమతి?

పఠాన్ కోట్ దాడిపై దర్యాప్తు కోసం పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులతో కూడిన దర్యాప్తు బృందం ఆ పని మీదే మార్చి 27న డిల్లీ రాబోతోంది. వారిలో కొందరిని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదులు దాడి చేసిన చోటికి వెళ్లి దర్యాప్తు చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించినట్లు తాజా సమాచారం. అయితే ఈ విషయాన్నీ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. పాక్ దర్యాప్తు బృందం డిల్లీ చేరుకొన్న తరువాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) అధిపతి శరద్ కుమార్ తెలిపారు. పాక్ బృందం భారత్ వచ్చినప్పుడు, ఈ దాడికి సంబంధించి భారత్, పాకిస్తాన్ లో చేసిన దర్యాప్తులో సేకరించిన విఅవరాలను ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకొంటాయని ఆయన తెలిపారు.

పఠాన్ కోట్ పై దాడి జరిగి ఇప్పటికి మూడున్నర నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు పాకిస్తాన్ ఆ దాడికి కుట్ర పన్నిన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ దాడికి కుట్రపన్నిన జైష్ ఏ మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని గృహ నిర్బంధంలో ఉంచామని పాక్ చెపుతోంది. కానీ అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఒకవేళ అది నిజమనుకొన్నా ఇంతవరకు అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో విచారణ మొదలుపెట్టకపోవడం గమనిస్తే ఈ కేసులో దోషులను శిక్షించాలనే ఆలోచన పాక్ ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తూ నెమ్మదిగా మిగిలిన పాత కేసులలాగే దీనిని కూడా పక్కన పడేయాలని పాక్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ డ్రామాని మరింత రక్తి కట్టించేందుకే పాక్ దర్యాప్తు బృందం పఠాన్ కోట్ లో కూడా దర్యాప్తు చేయాలనుకొంటోందని భావించవచ్చును.

పఠాన్ కోట్ ప్రవేశ ద్వారాల వద్ద కాపలాగా ఉండే భద్రతా సిబ్బందికి రూ.20 లంచం ఇస్తే పశువులను, వాటి కాపరిలను కూడా లోపలకి అనుమతించేవారని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చేయి. అదే నిజమయితే, పాక్ దర్యాప్తు బృందాన్ని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి అనుమతిస్తే, వారు కూడా అదే పాయింటుని హైలైట్ చేయకుండా ఉండరు. భారత భద్రతాదళాలే లంచం తీసుకొని పాక్ ఉగ్రవాదులను లోపలకి పంపించి ఉండవచ్చని, అంతర్జాతీయ వేదికలపై పాక్ టాంటాం చేస్తే అప్పుడు భారత్ ఏమని సమాధానం చెపుతుంది? శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా, ఈ దాడిలో తమదేమీ తప్పు లేదని, అయినప్పటికీ తమ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కారణంగానే, పఠాన్ కోట్ దోషులను పట్టుకొనేందుకు చాలా నిజాయీతీగా చాలా చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తోందని నిరూపించుకోవడానికే, పాక్ దర్యాప్తు బృందం భారత్ వస్తోందని అనుమానించక తప్పదు.

ఈ కేసులో దోషులను పట్టుకొని శిక్షలు పడేలా చేయడం కంటే, ప్రపంచ దేశాలకి తమ నిజాయితీని నిరూపించుకోవడానికే భారత్ ఎక్కువ ఇష్టపడుతున్నట్లుంది. అందుకే పాక్ గూడచారి సంస్థ ఐ.ఎస్.ఐ.కి చెందిన ఉన్నతాధికారితో కూడిన పాక్ దర్యాప్తు బృందాన్ని డిల్లీకి, పఠాన్ కోట్ కి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకడానికి సిద్దమవుతునట్లుంది.

ఈ వ్యవహారంలో పాక్ పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఉగ్రవాదుల నుంచి పఠాన్ కోట్ ని రక్షించుకొనేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన భారత వీర జవాన్లను అవమానించినట్లుగా ఉంది. ఇంతవరకు ఆ దాడికి కుట్ర పన్నినవారిని పట్టుకోకుండా, ఈ దాడిని కూడా ఒక సర్వ సాధారణమయిన ఒక ‘కేసు’గా మార్చి వేసి దానిపై ఇరుదేశాలు కలిసి ఈవిధంగా కాలయాపన చేస్తుండటం చాలా దురదృష్టం. ఒకవేళ మళ్ళీ మరోచోట ఉగ్రవాదులు దాడి చేస్తే అప్పుడు ఈ కేసును కూడా పక్కన పడేసి రెండు దేశాలు దానిపై దర్యాప్తు మొదలుపెడతాయేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘జ‌ల్లిక‌ట్టు’

భార‌తీయ సినిమా రంగంలో మ‌ల‌యాళం సినిమా ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంటుంది. వాళ్ల ద‌గ్గ‌ర బ‌డ్జెట్లు లేక‌పోవొచ్చు. కానీ.. ఆలోచ‌న‌లున్నాయి. ఎవ‌రికీ త‌ట్ట‌ని ఆలోచ‌న‌లు, త‌ట్టినా.. చెప్ప‌లేని క‌థ‌లు వాళ్లు ధైర్యంగా చెప్పేస్తారు....

కేంద్రంపై న్యాయపోరాటానికి కేసీఆర్‌కు “కాగ్” అస్త్రం..!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న భావనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ న్యాయపోరాటం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్‌కు...

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ స్పాట్ కేబుల్ బ్రిడ్జి..!

హైదరాబాద్ మరింత ఆకర్షణీయంగా అయింది. మంత్రి కేటీఆర్ తన ఆలోచనకు నిర్మాణ రూపమిచ్చారు. చకచకా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకు వచ్చారు. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. దూరం నుంచే...

ఏపీలో మద్యం బ్రాండ్ల కోసం మాల్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ప్రతీ ఏడాది ఇరవై శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. గత ఏడాదిలోనే మొదటి సారి ఇరవై శాతం.. తర్వాత లాక్...

HOT NEWS

[X] Close
[X] Close