పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు రగిలిపోతోంది. అక్కడి నుంచి పాక్ సైన్యం వెళ్లిపోయింది. బలూచ్ ప్రాంతం తమ అధీనంలో ఉందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. అంతే కాదు వారు పాకిస్తాన్ నుంచి తమ ప్రాంతంలోకి వచ్చే వాహనాలు, రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆర్మీ ఉద్యోగులు వస్తున్నట్లుగా కనిపిస్తే కాల్చి పడేస్తున్నారు. ఇప్పటికి అలా 130 మందిని చంపేశారు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి బలూచ్ ప్రజల్లో వంద శాతం మద్దతు ఉంది. ఆ ప్రాంతాల్లో ఎవరూ పాకిస్తాన్ ను సపోర్టు చేయరు. అందుకే పాక్ సైన్యం కూడా పారిపోక తప్పలేదు. ఇలాంటి పరిస్థితి రావడానికి పాకిస్తాన్ సైన్యమే కారణం. దశాబ్దాలుగా బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం అణిచివేతతో పాటు ఘోరాలకు పాల్పడుతోంది. బలూచిస్తాన్ నేతల్ని హత్యలు చేయడం దగ్గర నుంచి వనరుల్ని దోచుకోవడం వరకూ అన్ని పనులు చేస్తూనే ఉంది. దీంతో వారు చావడమో.. చంపడమో అన్న పాలసీకి వచ్చి విరుచుకుపడుతున్నారు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ మద్దతు కోరుతోంది. భారత్ మద్దతు ఇస్తుందో లేదో కానీ వారు మాత్రం తమ పోరాటాన్ని ఆపే చాన్స్ లేదు. భారత్ ఉమ్మడిగా ఉన్నా కూడా వారి పోరాటం అలా సాగేదని అనుకోవచ్చేమో. బలూచిస్తాన్ ప్రాంతం సహజ వనరులు ఎక్కువగా ఉండి.. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. వారిని అణిచివేసేందుకు పాకిస్తాన్ పాలకులు ఘోరాలకు పాల్పడ్డారు. ఇప్పుడు దాని ఫలితాలు అనుభవించే సమయం వచ్చింది.