తప్పటడుగులు వేస్తున్న పాకిస్తాన్

యురీ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడి తరువాత పాకిస్తాన్ వరుసగా తప్పటడుగులు వేస్తోంది. ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగబోతున్న సమయంలోనే ఈ దాడి జరుగడం, ఆ మరునాటి రోజు నుంచే కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తుండటం వారిని భారత సేనలు మట్టుబెడుతుండటాన్ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూనే ఉన్నాయి. భారత్ పై జరుగుతున్న ఉగ్రవాదుల దాడులతో తమ దేశానికేమీ సంబంధం లేదని పాక్ వాదిస్తున్నప్పటికీ, భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాశ్మీర్ లోనే జరుగుతుండటంతో భారత్ పై జరుగుతున్న ఆ దాడులన్నీ పాక్ ప్రేరేపితమేనని అందరికీ అర్ధం అవుతోంది.

ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశం గురించి మాట్లాడుతూ భారత్ భద్రతాదళాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని వెనకేసుకువస్తూ మాట్లాడి మరో పెద్ద పొరపాటు చేశారు. పాక్ ప్రధాని స్వయంగా ఒక ఉగ్రవాదిని వెనకేసుకు రావడం చూస్తే ఆ దేశం ఉగ్రవాదులని తయారు చేసి, వారిని భారత్ పై దాడులకి ప్రోత్సహిస్తోందని రుజువు అయ్యిందని సుష్మా స్వరాజ్ వాదించారు.

కాశ్మీర్ లో అల్లర్లని స్వాతంత్ర్య పోరాటంగా, బుర్హాన్ వనీని స్వాతంత్ర్య సమరవీరుడిగా పాక్ అభివర్ణించి వారికి మద్దతు ప్రకటించడం ద్వారా కాశ్మీర్ లో అల్లర్లకి పాకిస్తానే కారణమని, అది ఉగ్రవాదులకి వేర్పాటువాదులకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు రుజువు చేసుకొంది. ఇప్పుడు పాక్ ప్రధాని స్వయంగా బుర్హాన్ వనీకి మద్దతుగా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడటం ద్వారా భారత్ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమని రుజువయింది.

పాక్ చేసిన మరో పెద్ద తప్పు ఏమిటంటే, యుద్ధం గురించి మాట్లాడటం. భారత్ పై అణుబాంబులు ప్రయోగిస్తామని బెదిరించడం. భారత్ అటువంటి పదాలు వాడకుండా చాల జాగ్రత్తగా దౌత్యపద్ధతులకి అనుగుణంగా, ఆమోదయోగ్యంగా మాట్లాడింది. కానీ ఆ విషయంలో కూడా పాక్ నోరు జారింది. దానితో పాక్ లో ఉన్న అణ్వాయుధాలు, వాటి భద్రత గురించి ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి గట్టిగా హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.

కల్లు తాగిన కోతి చేతికి కొబ్బరికాయ చిక్కితే అది ఎప్పుడు, ఎందుకు, ఎవరి మీదకి విసురుతుందో తెలియనట్లే ఉగ్రవాదులు, యుద్దోన్మాద సైనికాధికారులతో నిండి ఉన్న పాకిస్తాన్ చేతిలో భయంకరమైన అణ్వాయుధాలు ఉండటం కూడా అంతే ప్రమాదం. వారి చేతుల్లో కీలుబొమ్మగా ఉన్న పాక్ ప్రభుత్వం వాటిని వారికి అందకుండా కాపాడగలదా? కాపాడలేకపోతే భారత్ పరిస్థితి ఏమిటి? ప్రపంచ దేశాల భాద్యత ఏమిటి? అందరూ ఆలోచించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close