నీటి సంక్షోభంతో అల్లాడిపోతున్నామని సింధూ జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ నీళ్లు విడుదల చేయాలని పాకిస్తాన్ వినమ్రంగా భారత్ కు ఓ లేఖ రాసింది. సింధూ జలాల ఒప్పందం రద్దు చేసినప్పుడు పాకిస్తాన్ లో అందరూ హూంకరించారు. మా నీళ్లు ఒక్క చుక్క కూడా వాడుకోలేరని ఎలా తీసుకోవాలని తెలుసని రంకెలేశారు. భారత్ చాలా వరకూ సింధూ జలాలను ఆపలేదని అనుకున్నారు. కానీ వెంటనే ఆపేసింది. మళ్లింపు చేసింది. కుదరని చోట ఒక్క సారే దిగువకు వదిలి వరదలు సృష్టించింది. ఆ నీరు ఉపయోగపడకుడా చేసింది.
భారత్ వ్యూహంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కొద్ది రోజుల్లోనే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తేలిపోయిది. సింధూనది కింద పాకిస్తాన్ లో ఉన్న అన్ని ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. వ్యవసాయం కాదు కదా.. రోజువారీ అవసరాలకూ నీటి సమస్య ఏర్పడింది. దీంతో ఏ మాత్రం సిగ్గుపడకుండా పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.
సరిహద్దుల్లో ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉంది. కాల్పుల విరమణ ఇద్దరూ పాటిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ లేఖపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాల్పుల విరమణకు.. సింధూ జలాల ఒప్పందం రద్దుకు సంబంధం లేదని.. ఆ నిర్ణయం కొనసాగుతుందని ఇప్పటికే భారత్ ప్రకటించింది. పాక్ లేఖపై ఉన్నత స్థాయిలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికి నీళ్లు వదలాల్సి వచ్చినా.. భవిష్యత్ లో ఆపేందుకు అవసరమైన డ్యాముల నిర్మాణాన్ని భారత్ వేగవంతం చేసే అవకాశం ఉంది.