పనామా : అమితాబ్‌ సహా పెద్దలపై పెద్దమరకలు!

పనామాలోని మోసాక్‌ ఫొనెస్కా పేపర్లు లీకయ్యాయి. యావత్తు ప్రపంచం మాదిరిగానే భారత్‌లో కూడా నల్లకుబేరుల పేర్లు కొన్ని బయటకు రావడంతో ప్రకపనంలు పుడుతున్నాయి. వివరాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వస్తే గనుక.. ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో… ఎందరు కొమ్ములు తిరిగిన ప్రముఖుల చీకటిసొమ్ముల బాగోతాలు బయటపడతాయో అందరూ నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ‘పనామా పేపర్స్‌’ నల్లడబ్బు కుంభకోణంలో బయటకు వచ్చిన భారతీయుల పేర్లలో దేశానికంతా సుపరిచితులైన, దేశానికి గర్వకారణాలు కూడా అయిన సెలబ్రిటీలు అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ తదితరులు ఉన్నారు. ఇంకా అనేక మంది వ్యాపార వేత్తలు డీఎల్‌ఎఫ్‌ గ్రూపునకు చెందిన కెపి సింగ్‌, ఇండియా బుల్స్‌ గ్రూపునకు చెందిన సమీర్‌ గెహ్లాట్‌, అదానీ గ్రూపునకు చెందిన వినోద్‌ అదానీ తదితరుల పేర్లు ఇప్పటికే వెలుగులోకి వస్తున్నాయి. ‘పనామా పేపర్స్‌’ కుంభకోణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా యావత్‌ జగతి గుర్తిస్తున్న ఈ వ్యవహారంలో సుమారు 500 మందికి పైగా భారతీయ ప్రముఖులకు ప్రమేయం ఉండచ్చునని అంచనా వేస్తున్నారు.

సిగ్గు పడాల్సిన విషయం ఏంటంటే.. మన దేశంలోని కొందరు బడాబాబులు వక్రమార్గాల్లో విదేశాలలో దాచుకుంటున్న లక్షల కోట్ల రూపాయల దొంగసొమ్మును స్వదేశానికి తీసుకువస్తాం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ గద్దె ఎక్కింది. రెండేళ్ల పాలనలో ఆదిశగా వారు చేపట్టిన చర్యలు శూన్యం అనే చెప్పాలి. మీరు విదేశాల్లో దాచుకున్న సొమ్మును మీరే వివరాలు చెప్పండి.. మీకు పన్ను మినహాయింపులు ఇస్తాం.. తరహా మెరమెచ్చు డైలాగులతో.. నల్లడబ్బు కుబేరుల కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నట్లుగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్నదే తప్ప… దృఢవైఖరితో ఉన్నట్లుగా ఇప్పటిదాకా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు.

ఇంతలో ఈ తాజాగా పనామా పేపర్స్‌ వ్యవహారం మరో దెబ్బ! ఇప్పుడు వెల్లడవుతున్న వాస్తవాలు దేశంలో జనాన్ని నిర్ఘాంత పరుస్తున్నాయి. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే.. వస్తున్న కొన్ని పుకార్లు నిజమే అయితే గనుక.. అమితాబ్‌ బచ్చన్‌.. వచ్చే విడత ఎన్నికల్లో ఈ దేశానికి రాష్ట్రపతి అయిపోబోతోన్న వ్యక్తి. మోడీ ఓటు కూడా ఆయన వైపే ఉన్నట్లు పుకార్లున్నాయి. అలాంటి అమితాబ్‌ ఈ దేశానికి పన్నులు ఎగ్గొట్టి.. నల్లడబ్బును విదేశాల్లో దాచుకుంటున్న నిందితుల్లో మొదటి సెలబ్రిటీ! ఆయన కోడలు అందాల కీర్తిపతాకను ప్రపంచ యవనికపై ఎగురవేసిన ఐశ్వర్యారాయ్‌ మరో నిందితురాలు. మోడీకి సన్నిహితులుగా గుర్తింపు ఉన్న వ్యాపార దిగ్గజాలు అదానీ గ్రూపు … ఇలా అనేక మంది కొమ్ములు తిరిగిన ప్రముఖులు ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది. వీరి గడ్డాలూ కాళ్లూ పట్టుకుని ”బాబ్బాబూ.. మీ సొమ్ములు వెనక్కు తెచ్చేసుకోండి.. పన్ను మినహాయింపులు ఇస్తాం” అంటూ బతిమాలుతుందా? రాష్ట్రాల అవసరాలు అంటే చులకనగా చూసే దుర్మార్గపు అలవాటున్న మేధావి అరుణ్‌జైట్లీ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close