ఆపరేషన్ సిందూర్‌పై చర్చకూ కాంగ్రెస్ సభ్యులు,ఇండీ కూటమి సభ్యులు పార్లమెంట్ లో చర్చకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. చర్చ ప్రారంభమయ్యే సమయానికి వారు ఆందోళనలు చేయడంతో ఉభయసభలు వాయిదాలు పడుతున్నాయి. బీహార్ లో ఓట్ల సవరణ ప్రక్రియను ఆపేయాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అసలు సమస్యపై చర్చించకుండా కొత్త కొత్త సమస్యలపై చర్చకు పట్టుబట్టి సభను సాగనివ్వకుండా చేయడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని.. చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ కావాలంటూ నిరసనలు చేపట్టారు. దానికి అధికారపక్షం అంగీకరించింది. సోమవారం పదకొండు గంటల నుంచి చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ విపక్షాలు సభను అడ్డుకోవడంతో వేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పై చర్చకు డిమాండ్ చేసి.. తీరా చర్చ ప్రారంభమయ్యే సమయానికి ఇలా వెల్ లోకి వచ్చి అడ్డుకోవడం ఏమిటని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై చాలా నిజాలు తెలియాలని కాంగ్రెస్ అంటోంది. అలాంటప్పుడు.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఆ నిజాలు చెప్పాలి. కానీ ఇప్పుడు బీహార్ టాపిక్ ను ఎత్తుకుని ఆపరేషన్ సిందూర్ పై చర్చకు సిద్ధం కాకపోతే ప్రజలు విపక్షం దివాలా తీసిందని అనుకుంటారు. ప్రస్తుతం బీహార్ ఓటర్ల లిస్టులో అంశం సుప్రీంకోర్టులోనూ ఉంది. అలాంటప్పుడు.. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించిన తర్వాత మిగతా అంశాలపై డిమాండ్ చేయవచ్చు. కానీ ఇండీ కూటమి వేరే ఆలోచనల్లో ఉంది.