వెయ్యకోట్ల ”ఆర్జిత సేవలు” – అటకెక్కిన న్యాయవిచారణ? పుష్కరాలపై విశ్లేషణ -3

తణుకు దగ్గర నేషనల్ హైవే పక్కన ఒక మధ్యతరహా రెస్టారెంటు అప్పుల్లోవుంది. మంచిధర రాక అమ్మకోలేకా, పెరిగిపోతున్న వడ్డీ భారాలు మోయలేకా ఆయజమాని అవస్ధ పడుతూండగా పుష్కరాలు వచ్చాయి. రోజుకి రెండు లక్షల రూపాయల అమ్మకాలు అయ్యాయి. హొటల్ వ్యాపారంలో ఖర్చులు తగ్గించుకోగలిగితే 30 శాతం వరకూ లాభాలు వుంటాయి. అప్పులు తీర్చిన ఆ యజమాని తనహొటల్ ని ఆధునీకరించే ఆలోచనలో వున్నారు.

రవాణా, వసతి, భోజనం, యాత్రకు గుర్తుగా చిన్నచిన్న వస్తువుల కొనుగోళ్ళు, పూజా సామగ్రి కొనుగోళ్ళు, పూజారులకు ఫీజు, దక్షిణలు, దానాలు…ఇలా ఒకో యాత్రికుడూ సగటున తక్కువలో తక్కువ రెండు వందల రూపాయలు ఖర్చుచేశారనుకుంటే పుష్కరాల వల్ల కనీసం1000 కోట్లరూపాయలు చిన్నచిన్న వ్యాపారుల చేతులు మారింది. ఇవన్నీ చిన్న మధ్య తరగతుల వారి ”ఆర్జిత సేవలే”. అలాగే పన్నెండురోజుల సన్నాహాలకే ప్రభుత్వశాఖలు దాదాపు 300 కోట్లరూపాయలు ఖర్చుచేశాయి. ఆసమయంలో రాజమండ్రి, పరిసరాల్లో, ఎలకీ్ట్రషియన్లు, ప్లంబర్లు, పెయుంటర్లు, కార్పెంటర్లు …ఒకరని కాదు అన్నిరకాల చేతి పనులవారికీ పనులు బాగాదొరికాయి. ప్రజలు ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చులో మూడోవంతు డబ్బు రాజమండ్రి పరిసరాల్లోకే పంప్ అయ్యింది. మహిళా సంఘాలకు, సహకారసంఘాలకు డ్వాక్రా గ్రూపులకు పుష్కర షెల్టర్ల వద్ద స్టాల్స్ కేటాయించి వారి ఉత్పత్తులకు మార్కెట్ సృష్టించిన ఆలోచన ముఖ్యమంత్రిది కాగా, అందిపుచ్చుకుని సొమ్ము చేసుకున్న చొరవ విమెన్ ఎంపౌర్ మెంటులో దేశంలోనే అగ్రస్ధానాన వున్న తూర్పుగోదావరి జిల్లా మహిళా సంఘాలదే.

ఇంతకుముందెన్నడూలేని విధంగా రాష్ట్రం నలుమూలలనుంచీ 9000 మంది కళాకారులు మొత్తం 11 వేదికలపై పన్నెండురోజులూ రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ప్రజలు మరచిపోయిన పౌరాణిక నాటకాలూ, శాసీ్త్రయ సంగీత,నృత్య ప్రదర్శనలకు పుష్కరాలు మహా వేదిక అయ్యింది. ”ఇదొక బిగ్ మార్కెట్ అనుకుని మీ పొ్రడక్టుని ఎలా సేల్ చేయాలో ప్లాన్ వేసుకోండి డిస్ ప్లే చేయండి. సక్సెస్ అవుతారు” అని ఒక సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారని హస్తకళల విభాగం జాయింట్ డైరక్టర్ వివరించారు.

ప్రతీ విషయంలోనూ ముఖ్యమంత్రి ఒక డైరక్షన్ ఇచ్చారు. రోజుకో అంశం మీద ఆ రంగం నిపుణులతో ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియంలో వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించారు. ఆ విధంగా నాలెడ్జ్ రిసోర్సెస్ ని సామాన్యుల ఆలోచనల్లో ప్రవేశపెట్టగలిగారు.

మొదటి రోజు తొక్కిసలాటలో 27 మంది చనిపోయాక షాక్ తిన్నా, తేరుకుని ప్రతీ అంశంలోనూ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. అంతటి వత్తిడిలో కూడా చంద్రబాబు అర్ధరాత్రి ఆకస్మిక పరిశీలనల్లో లైటు తనమీద పడే చోటులో, నది బేక్ డ్రాప్ లో వుండే పొజిషన్ లోకి వెళ్ళి మాట్లాడటం వల్ల ఫొటోగ్రాఫర్లకీ, వీడియో గ్రాఫర్లకీ చక్కటి విజువల్స్ దొరికాయి. ప్రతి విషయంలో ముఖ్యమంత్రి ఎంత కీన్గా వున్నారోచెప్పడానికే ఈ ఉదాహరణ.

”ప్రమాదానికి బాధ్యుల్లో ఏ ఒక్కరినీ వొదిలేదిలేదు. ఇంకా పదకొండు రోజులు పనులు వున్నాయి. ఆవెంటనే ఉన్నతాధికారితో విచారణ చేయించి చర్యలు చర్యలు తీసుకుంటాము. అని మొదటి రోజు మద్యాహ్నం చెప్పిన చంద్రబాబు ఈ ఘటన పై న్యాయవిచారణ జరిపిస్తామని సాయంత్రం చెప్పారు. ఈ ఘటనపై ఒక వ్యక్తి వేసిన పిటీషన్ ను మానవ హక్కుల కమీషన్ విచారణకు స్వీకరించడమే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మార్చుకోడానికి కారణం. వెంటనే న్యాయవిచారణ నిర్ణయాన్ని ప్రకటించకుండా మానవ హక్కుల కమీషన్ నిర్ణయం వెలువడ్డాక తన ఆలోచనను మార్చుకోవడం నాయకుడి లక్షణాన్నికాక తొటు్రపాటు గుణానికే సాక్ష్యంగా నిలబడుతోంది.

పుష్కరాలు ముగిసి ఏడవరోజు. మరి న్యాయవిచారణ ఏమైందో తెలియదు. న్యాయవిచారణకు ఒక ప్రాసెస్ వుంది. రిటైర్డ్ న్యాయమూర్తుల లో ఒకరికి ఈ బాధ్యత అప్పగించాలని న్యాయశాఖ హైకోర్టుని కోరాలి. కోర్టు పంపిన పేనల్ లో ఒకరిని ఎంపిక చేసి వారి ఆమోదం పొంది విచారణాంశాలను, గడువును నొటిఫైచేయాలి. ప్రభుత్వ అధికారులు ఫాలో అప్ చేయకపోతే ఫైళ్ళు కదలవు. ముఖ్యమంత్రిని వెన్నంటి వుండే రాజకీయ నాయకత్వమే ఇందుకు పూనుకోవాలి. చంద్రబాబు కోటరీ గా పేరు పడిన నాయకులు అధికారుల ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ ఇపుడు రాజధాని నిర్మాణ సన్నాహాలు మాత్రమే. మరే రాషా్ట్రనికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కేబినెట్ మం్రత్రి హోదా వున్న మీడియా సలహాదారు వున్నారు. ఆయన ఫాలో అప్ చేయవచ్చు లేదా న్యాయ విచారణ వ్యవహారం ఏదశకువచ్చిందో మీడియాకు వెల్లడించ వచ్చు. ఇదేమీ జరగకపోవడం వల్ల ”పుష్కరాలు అయిన వెంటనే న్యాయ విచారణ అన్నారు. ఊరుదాటగానే అన్నీ మరచిపోయారు. ఈ ముఖ్యమంత్రికి ఆరోజు గడిస్తేచాలు”అనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close