పాక్ తో చర్చలు రద్దు చేసుకొంటే ఎవరికి నష్టం?

పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసి భారత్ అహాన్ని దెబ్బ తీసారు. దానిని భారత్ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంగానే అందరూ భావిస్తున్నారు. అందుకే పాక్ తో చర్చలు రద్దు చేసుకొని, పాక్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేయాలని శివసేన సూచిస్తోంది. మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా సైతం భారత్ పాక్ పట్ల భారత్ అనుసరిస్తున్న మెతక వైఖరిని తప్పు పడుతున్నారు. ఆయన కూడా పాక్ తో చర్చలు రద్దు చేసుకోవాలని సూచించారు. అయితే పాక్ తో చర్చలు రద్దు చేసుకొంటే ఏమవుతుంది? పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగితే ఏమవుతుంది? పాక్ తో చర్చలు కొనసాగిస్తే అమవుతుంది? అనే మూడు ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించవలసి ఉంది.

ఒకవేళ పాక్ తో చర్చలు రద్దు చేసుకొన్నట్లయితే, పాక్ ప్రభుత్వంపై కూడా అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతుంది. కనుక అప్పుడు పాక్ ప్రభుత్వం తన ప్రజల, సైనికాధికారుల, ఉగ్రవాదుల అహం చల్లార్చేందుకు మళ్ళీ సరిహద్దులలో కాల్పులు మొదలుపెట్టడానికి అనుమతించవచ్చును. భారత్ గురించి అంతర్జాతీయ వేదికల మీద మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టవచ్చును. పఠాన్ కోట్ దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకొంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడికి స్వయంగా ఫోన్ చేసి హామీ ఇచ్చిన తరువాత కూడా భారత్ అహంకారం ప్రదర్శించి శాంతి చర్చలను కాలదన్నుకొందని ప్రచారం చేసుకొనే అవకాశం పాక్ కి కలుగుతుంది. పాక్ లో తిష్టవేసుకొని కూర్చొన్న ఉగ్రవాదులు కూడా సరిగ్గా ఇటువంటి పరిణామాలను ఆశిస్తున్నారు కనుక వారు ఇంకా పెట్రేగిపోవచ్చును. ఇటువంటి పరిస్థితులు పాకిస్తాన్ కి కొత్త కావు కనుక వాటి వలన దానికి పెద్ద తేడా ఉండదు. కానీ వాటి వలన మళ్ళీ నష్టపోయేది భారతదేశమే. కనుక ఈ ఆలోచన కూడా సరయినది కాదని స్పష్టం అవుతోంది.

ఇక పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు దిగితే, అది అణ్వస్త్ర యుద్దానికి దారి తీయడం తధ్యం. దాని వలన ఇరుదేశాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి. ఇన్ని దశాబ్దాలలో భారత్ లో జరిగిన అభివృద్ధి అంతా కొన్ని రోజుల వ్యవధిలోనే తుడిచిపెట్టుకుపోతుంది. రెండు దేశాలు మళ్ళీ కొన్ని దశాబ్దాలపాటు కోలుకోలేనంత దారుణస్థితికి దిగజారిపోతాయి. కనుక ఈ ఆలోచన కూడా సరయినది కాదని స్పష్టం అవుతోంది.

ఈ రెండు విధానాలు సరయినవికావని తేలినప్పుడు ఇక మిగిలిన ఏకైక మార్గం చర్చలే. పాక్ తో చర్చలు కొనసాగించడం ద్వారానే దానిపై నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉగ్రవాదుల బెడదను వదిలించుకొనే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ లో తిష్టవేసుకొనున్న ఉగ్రవాదులను, ప్రజా ప్రభుత్వంపై పెత్తనం చేలాయిస్తున్న యుద్ధోన్మాద సైనికాధికారులపై ప్రధాని నవాజ్ షరీఫ్ నియంత్రణ సాధించినపుడే ఇరుదేశాల మధ్య శాంతి నెలకొంటుంది. కనుక నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అంత శక్తి సమకూర్చుకొనేందుకు భారత ప్రభుత్వమే ఆయనకి అవసరమయిన సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడి బహుశః అదే పని చేస్తున్నారు కనుకనే పాక్ లోని భారత వ్యతిరేక శక్తులు ఈ దాడికి పాల్పడ్డాయని భావించవచ్చును. వాటి ఉద్దేశ్యం ఏమిటో ఇంత స్పష్టంగా తెలుస్తునపుడు వాటి ఉచ్చులో పడాలని విదేశాంగ మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా చెప్పడమే విస్మయం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close