‘ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పవన్ కల్యాణ్ సరదాగా మాట్లాడారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గుర్తుచేసుకున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కటానా పట్టుకుని రావాలని సుజీత్, తమన్ కోరారు. దాన్ని పట్టుకోవడం ఓ సమస్య అయితే, దానికి తోడు వర్షం పడింది. నా జీవితంలో ఇలా ఎప్పుడూ చేయలేదు. అందరూ నాతో ఆడుకుంటున్నారు’ అని నవ్వించారు.
ఈ రోజు వేడుకకు బ్లాక్ డ్రెస్సు, కళ్లజోడుతో, తుపాకీ పట్టుకుని రావాలన్నారు. చంపేస్తా అని చెప్పా. గన్ నా వీక్నెస్ అని తెలుసుకుని ఆడుకుంటున్నారు’ అని పవన్ వ్యాఖ్యానించడం నవ్వులు పూయించింది. ఇదే సందర్భంలో అభిమానుల కోసం ఓజీ సినిమాలో ఉపయోగించిన జానీ గన్ వేదికపై పవన్ పట్టుకోవడం అందరినీ అలరించింది.
సుజీత్ ఈ కథ చెప్పినప్పుడు తన దగ్గర ఐడియా మాత్రమే ఉంది. కానీ తనకి గొప్ప విజువల్ సెన్స్ ఉంది. తను Gen Z డైరెక్టర్. ఒక సెన్సిటివ్ డ్రామా ని డీల్ చేయగలిగే గొప్ప దర్శకుణ్ని ఈ సినిమాతో చూశాను. ఈ సినిమాని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మరోసారి సుజీత్‌తో కలిసి పని చేయాలనిపించింది. సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేద్దామని మాటిచ్చాను. కానీ దానికి చాలా కండిషన్స్ ఉంటాయి’ అన్నారు.