హ్యాపీ బర్త్‌డే : రాజకీయం మారిస్తే ఏపీకి ఫ్యూచర్ “పవర్ స్టార్ ” పవనే..!

పవన్ కల్యాణ్… ఈ పేరు చెప్పుకోవాలంటే.. ముందుగా పవర్ స్టార్ అనే బిరుదును కచ్చితంగా చేరుస్తారు అభిమానులు. సాధారణ అభిమానులే కాదు.. ఎవరైనా… సరే పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించాలంటే.. అన్యాపదేశంగా.. “పవర్ స్టార్ పవన్ కల్యాణ్” అనే పేరు ‌అన్యాపదేశంగా నోటి వెంట వచ్చేస్తుంది. అంతగా.. సిల్వర్ స్క్రీన్‌పై తన పవర్ చూపిన పీకే… ఇప్పుడు పొలిటికల్ తెరపై .. తన “పవర్‌”ను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. “పవర్” సాధించి.. తాను సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పవర్ స్టార్‌నేనని నిరూపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పవన్ కల్యాణ్‌ది ఇది అంత తేలిక కాదు.. కానీ.. అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు దానికి తగ్గట్లుగా “వాక్యూమ్” ఉంది.

“అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి”లాంటిదే మొన్నటి ఎలక్షన్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా కెరీర్ చూస్తే… మొదటి సినిమా తర్వాత… ఎవరూ.. ఆయనో హీరో మెటీరియల్ అని ఎవర అనుకోలేదు. “అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి” సినిమా షూటింగ్‌లోనే… ఆయనకు నటన రాదని.. గేలిచేసినవాళ్లు ఎందరో ఉన్నారు. ఎలాగోలా అష్టకష్టాలు పడి సినిమా రిలీజ్ చేస్తే.. అదో డిజాస్టర్. ఆ తర్వాత పవన్ తో సినిమా తీసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పటి ఆయన పరిస్థితి చూసి.. మరో నాగబాబు అనుకున్నారు. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం అలా అనుకోలేదు. తన పవర్ ఏంటో చూపించాలనుకున్నారు. పాతాళం నుంచి ఫీనిక్స్ పక్షిగా ఎదిగారు. తన యాటిట్యూడ్‌తోనే… సక్సెస్‌లు కొట్టారు. పవర్ స్టార్‌గా నిలబడ్డారు. ఇప్పుడు.. రాజకీయాల్లోనూ.. ఆయన తన తొలి ఎలక్షన్‌లో… “అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి” అంత ఫ్లాప్ చూశారు. కానీ.. ఇప్పుడు ఆయనను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన స్వయంగా రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ.. ఆయన పట్టుదల తెలుసు కాబట్టి.. ఎవరూ లైట్ తీసుకోవడం లేదు. దానికి తగ్గట్లే పవన్ కల్యాణ్ ప్యూచర్ పాలిటిక్స్ ఉంటున్నాయి.

మాటల్లో స్ఫూర్తి .. చేతల్లో చూపితే భవిష్యత్ పవనిజానిదే..!

పవన్ మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. తాను ఏకబిగిన సీఎం కావడానికి రాలేదని.. ప్రజల కోసమే వచ్చానని పవన్ చెబుతూంటారు. దానికి తగ్గట్లే ఆయన ప్రజల కోసం పోరాడుతున్నారు. పాతికేళ్ల రాజకీయానికి వచ్చానని ఆదరాబాదరా ఏమీ లేదని కూడా చెబుతూంటారు. ప్రసంగాల్లో ఎన్నెన్నో స్ఫూర్తి వాక్యాలు దొర్లుతూ ఉంటాయి. అవన్నీ పవన్ కల్యాణ్ మనసులో నుచి వచ్చే మాటలే. ఆ స్ఫూర్తి … కొనసాగిస్తే.. చాలు.. పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం ఉజ్వలంగా ఉంటుందని.. అంచనా వేసుకోవచ్చు. ఈ విషయంలో రాజకీయ పరిస్థితులు కూడా కలిసి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

భవిష్యత్ లో కనిపించే… కనిపిస్తున్న నేత పవన్ కల్యాణ్ మాత్రమే..!

వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో.. నిపుణులు.. తరగతుల్లో ఉండే వారికి.. ఓ ప్రశ్న వేస్తారు. ఓ పదిహేను, ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారో.. ఓ చోట రాసుకోండి అంటారు. అప్పుడు వారంతా.. తమ లక్ష్యాన్ని రాసుకుంటారు. కానీ చాలా మంది.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది అంచనా వేసుకోరు. అది వేసుకుంటే.. తమ ఆలోచనలు మరింతగా ఉన్నతంగా ఉండేలా చేసుకుంటారు. కానీ పవన్ కల్యాణ్.. అప్పటి పరిస్థితులు అంచనా వేసుకునే… పాతికేళ్ల రాజకీయం గురించి మాట్లాడుతున్నట్లుగా భావించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వయసు చూసినా.. ఆ పార్టీ భవిష్యత్ నేతలుగా ఉన్న వారి బ్యాక్‌గ్రౌండ్ చూసినా… మరో పదేళ్లు ఆ పార్టీ ప్రజల్లో నిలకడగా నిలబడినా కష్టమనే అంచనా ఉంది. ఇక వైసీపీ.. అనేది.. వైఎస్ సెంటిమెంట్ పునాదుల మీద ఏర్పడింది. రాజన్న పుత్రునికి ఒక్క చాన్స్ ఇచ్చారు కాబట్టి.. అది ఇక ఉండే అవకాశం లేదు. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక్క మెతుకు చాలన్నట్లుగా.. జగన్ పాలన ఎలా ఉంటుందో మూడు నెలల్లో తేలిపోయింది. ఇక ఆ పార్టీ ప్రజాభిమానాన్ని వైఎస్ బ్రాండ్‌తో కొనసాగిస్తుందని… చెప్పడానికి అవకాశం లేదు. పైగా జయలలిత తరహాలో.. కేసుల్లో ఎప్పుడు శిక్ష పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. ఇక ఉంది.. జనసేన పవన్ కల్యాణ్ మాత్రమే. ఐదు, పదేళ్ల తర్వాత ఏపీ రాజకీయాలను ఊహించుకుంటే కనిపించేది.. పవన్ కల్యాణ్ మాత్రమే.

అంత తేలిక కాదు.. ! రాజకీయం .. రాజకీయంలాగా చేసినప్పుడే..!

ఏపీలో ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ ఉంది. గొప్పగా అభివృద్ది చేశామని చెప్పుకున్న టీడీపీ.. దారుణంగా ఓడిపోయింది. ఎన్నికలను పరిశీలిస్తే.. ప్రజల ఓటింగ్ ఎజెండా స్పష్టంగా మారిపోయింది. అభివృద్ధి, అవినీతి ఓటు ప్రాతిపదిక కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించలేని పార్టీలు… అంతర్థానమవుతున్నాయి. ఇప్పటికీ.. అభివృద్ధి అంటున్న టీడీపీ.. ఆ తేడాను గుర్తించలేక ఆ జాబితాలో చేరిపోతోంది. పవన్ కల్యాణ్ .. రాజకీయాన్ని రాజకీయంగా చేయడానికి ఇంతకన్నా.. గొప్ప అవకాశం రాదు. పొలిటికల్ వాక్యూమ్‌ని… ఫిల్ చేయడానికి.. జనసేనకు.. జనసేనానికి గోల్డెన్స్ చాన్స్ ఇప్పుడు ఉంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా… ఇదే లక్ష్యంతో.. పవన్ ముందడుగు వేస్తే… భవిష్యత్ పొలిటికల్ పవర్ స్టార్.. మరో నాలుగైదేళ్లలోనే ఆవిర్భవించడం ఖాయం.
హ్యాపీ బర్త్‌డే ఫ్యూచర్ “పవర్” స్టార్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close