ఇంకో ఆప్ష‌న్ లేకే… ప‌వ‌న్ ఇలా చేశాడా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌న్నీ వ‌రుస‌గా ప‌ట్టాలెక్కేయ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడుతో బిజీగా ఉన్నాడు ప‌వ‌న్‌. ఆ వెంట‌నే నేస‌న్ సినిమా, దాని త‌ర‌వాత త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కేస్తాయి. ఆల్మోస్ట్ హీరోయిన్లు కూడా ఫిక్స‌యిపోయారు. కాక‌పోతే.. నేస‌న్ సినిమాని సాయేషా సైగ‌ల్‌ని తీసుకోవ‌డ‌మే ప‌వ‌న్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ప‌వ‌న్ ప‌క్క‌న సాయేషా ఏమాత్రం ఆన‌ద‌ని, ఓ ఫ్లాప్ హీరోయిన్‌ని ఎందుకు తీసుకొన్నారో అని బెంగ పెట్టుకొన్నారు. అఖిల్ సినిమాలో సాయేషా ఉద్ద‌రించిందేం లేదు. ఆమె న‌ట‌న‌కు, గ్లామ‌ర్‌కీ మైన‌స్ మార్కులే ప‌డ్డాయి. అఖిల్ త‌ర‌వాత ఎవ్వ‌రూ ఆమె వైపు చూళ్లేదు. అలాంటిది ప‌వ‌న్ ఏరి కోరి ఎందుకు ఎంచుకొన్నాడో.. అన్న‌ది అభిమానుల డౌట్‌.

నిజానికి సాయేషా ఎంపిక అంత ఈజీగా ఏం జ‌ర‌గ‌లేదు. ముందు చాలా ఆప్ష‌న్లు ప‌రిశీలించారు. స్టార్ హీరోయిన్ల లిస్టు వేసుకొని.. ఒకొక్క‌రి కాల్షీట్లూ వెదికారు. అయితే ఎవ్వ‌రూ అందుబాటులో లేరు. ఇప్పుడు దూసుకుపోతున్న న‌వ‌త‌రం హీరోయిన్ల‌నీ అడిగి చూశారు. ప‌వ‌న్ బృందం అడుగుతున్న డేట్లు ఏ ఒక్క‌రూ స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయారు. అప్పుడు ఖాళీ భామ‌ల జాబితా ఒక‌టి త‌యారైంది. ఆ ప్లేసులో ముందున్న పేరు సాయేషానే. అలా.. సినిమాల్లేక ఖాళీగా ఉండ‌డం సాయేషాకు క‌లిసొచ్చింది. దానికి తోడు ఈ సినిమాని వీలైనంత త‌క్కువ బ‌డ్జెట్‌లో చేయ‌మ‌ని ప‌వ‌న్ సూచించాడ‌ట‌. స్టార్ క‌థానాయిక అంటే ఎంత కాద‌న్నా కోటి రూపాయ‌లు ఇవ్వాలి. అంత ఇవ్వ‌లేక‌.. సాయేషా ద‌గ్గ‌ర హీరోయిన్ అన్వేష‌ణ ఆపార‌ని స‌మాచారం. అదీ.. సాయేషా ఎంపిక వెనుక ఉన్న స్టోరీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close