సభా సమరానికి సర్వం సిద్ధం

తేదీలు ఖరారయ్యాయి. ఎజెండా సిద్ధమైంది. తొలిరోజు చర్చనీయాంశం ఏమిటో నిర్ణయం జరిగింది. ఇక చర్చలు వాద ప్రతివాదనలే తరువాయి. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. సమావేశాలకు ముందు రోజే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగడం ఈసారి ప్రత్యేకత.

ప్రస్తుతానికి ఈనెల 30 వరకూ సభా కార్యక్రమాల ఎజెండాను ఖరారు చేశారు. దీని ప్రకారం 12 పనిదినాల్లో సభ జరుగుతుంది. సమావేశాల తొలిరోజు, 16న పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మొత్తం 9 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించారు. ఈనెల 30 తర్వాత మరోసారి బీఏసీ సమావేశం జరుగుతుంది. జనవరిలో సమావేశాలను జరపడంపై అందులో నిర్ణయం తీసుకుంటారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్, ఇతర అంశాలపై చర్చిస్తారు. సమావేశాల కోసం అధికార ప్రతిపక్షాలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈసారి తెరాస పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం కావడం విశేషం. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన తెరాసను తీవ్రంగా ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే వివిధ అంశాలపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ చేయబోయే విమర్శలను ముందుగానే ఊహించి, తిప్పికొట్టడానికి నోట్స్ సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ తన పార్టీ వారికి సూచించారు. ప్రతిపక్షాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా చూడాలనేది ఆయన ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

క‌మ్ బ్యాక్ కోసం నిత్య‌మీన‌న్ ఆరాటం

అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ఒడిసిప‌ట్టుకోవాలి. అవి చేజారిపోయాక‌.. ఆరాట‌ప‌డ‌డంలో అర్థం లేదు. చిత్ర‌సీమలో అవ‌కాశ‌మే గొప్ప‌ది. దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటామ‌నే విష‌యంపైనే కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ సంగ‌తి నిత్య‌మీన‌న్‌కి ఇప్పుడిప్పుడే...

గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే....

HOT NEWS

[X] Close
[X] Close