రిషికొండ ప్యాలెస్ ను పవన్ కల్యాణ్ పరిశీలించారు. పార్టీ నేతలతో పాటు టూరిజం మంత్రి దుర్గేష్ కూడా పవన్ వెంట ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి లైఫ్ స్టైల్ కోరుకున్నారో చూసి ఆశ్చర్యపోయారు. రెండు బ్లాక్ లకి మాత్రమే 90 కోట్లు ఒకదానికి 70 కోట్లు ఒకదానికి ఖర్చు చేశారని.. అధికారులు తెలిపారు. 7 బ్లాక్ లకి 4 మాత్రమే కట్టడం జరిగిందని.. 454 కోట్లతో 4 బ్లాక్ లు ఖర్చు చేశారన్నారు.
గతంలో ఇక్కడ టూరిజం రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం టూరిజం శాఖకు వచ్చేదని.. ప్రస్తుతం కేవలం కరెంట్ బిల్లు సంవత్సరానికి 15 లక్షలు అవుతుందని టూరిజం మంత్రి పవన్ కల్యాణ్‌కు వివరించారు. మిగతా వాటికోసం ఇంకా మాట్లాడనవసరం లేదని.. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని పవన్ వ్యాఖ్యానించారు. ఉపయోగంలో లేకపోవడం వల్ల లోపల పెచ్చులు ఉడిపోతున్నాయి కొన్ని చోట్ల లీకేజ్ అవుతుందన్నారు.
జగన్ నివాసం ఉండడానికి కట్టారు కానీ మనం దీనిని టూరిజం కింద ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నామని.. పవన్ తెలిపారు. ప్రస్తుతం కేసు ఎన్జీటేలో ఉందని.. అధికారులు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దీన్ని ఎలా ఉపయోగంలోకి తీసుకు రావాలో నిర్ణయించలేకపోతోంది. కేసులు ఉండటంతో పాటు ఈ ప్యాలెస్ అటు హోటల్ గా కానీ ఇటు .. ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఉపయోగపడటం లేదు. త్వరలో న్యాయపరమైన చిక్కులు క్లియర్ చేసుకుని.. ఏదో విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.