ప్రణయ్‌కు విగ్రహమా..? దేశం కోసం చనిపోయాడా..?

“అతి సర్వత్రా వర్జయేత్” అన్నారు పెద్దలు… ఏదైనా పరిమితికి మించితే.. సైడ్ ఎఫెక్టులు వచ్చేస్తాయి. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడి హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఇదే నిజమనిపించకమానదు. ప్రణయ్ విగ్రహం పేరుతో కొంత మంది మిర్యాలగూడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ ప్రణయ్‌ కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తానని ప్రకటించారు. దీంతో మిర్యాలగూడలోని సాగర్‌రోడ్డుపై శకుంతల థియేటర్‌ ఎదురుగా విగ్రహ నిర్మాణ పనులను మొదలు పెట్టారు. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ ఔట్‌పోస్టును తొలగించి అదే ప్రదేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గుంత తవ్వారు. కానీ నిర్మాణం ముందుకు సాగలేదు. కారణం మిర్యాలగూడ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడమే.

పట్టణానికి చెందిన పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పట్టణ నడిబొడ్డున విగ్రహ ఏర్పాటుకు అనుమతులివ్వొద్దని కోరుతూ ఆర్డీవో, డీఎస్పీ, మునిసిపల్‌ కార్యాలయాల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సాగర్‌రోడ్డులో పలువురు జాతీయ నేతల విగ్రహాలు ఉన్నాయని, వాటి మధ్య ప్రణయ్‌ విగ్రహాన్ని పెట్టడం సరికాదని ఇంకొందరు అంటున్నారు. సోషల్ మీడియాలోనూ.. ప్రణయ్ ఏమైనా దేశం కోసం చనిపోయాడా..? విగ్రహం పెట్టడానికి అన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. దీంతో విగ్రహ పనులు నిలిచిపోయాయి. నిజానికి అధికారులెవరూ.. విగ్రహనిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. జీవో 55 ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఆ ప్రకారం.. అనుమతులు ఇవ్వాలంటే.. దానికో లెక్క ఉంటుంది. ప్రణయ్ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి రాదు. రోడ్ల మీద కాకుండా.. ప్రైవేటు స్థలంలో.. ఎలాంటి అనుమతులు లేకుండా పెట్టుకోవచ్చు.

మీడియా ఇచ్చిన అమితమైన అతి ఇంపార్టెన్స్‌తో.. ప్రణయ్ దేశం కోసం ప్రాణాలు వదిలాడన్న భావనతో ఆయన భార్య అమృత ఉండిపోయారు. వరుసగా మీడియా ఇంటర్యూలు చేస్తూండటంతో.. గొప్ప సెలబ్రిటీగా భావిస్తున్నారు. ఒక్కొక్క రాజకీయ నేత వచ్చి… పరామర్శలు, ఆర్థిక సాయాలు ప్రకటించడమే కాదు.. విగ్రహాలు, ఉద్యోగాలు, ఎమ్మెల్యే సీట్ల వరకూ హామీలు ఇచ్చి పోతూంటే.. ప్రణయ్‌లో మహాత్ముడ్ని చూసుకుంటున్నట్లు ఉన్నారు ప్రణయ్. కానీ.. హత్య జరిగినప్పుడు.. ప్రణయ్‌కు అమృతకు లభించిన ప్రజల మద్దతు ఇప్పుడు లేదు. సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ… రెండు కుటుంబాల మధ్య సమస్యను.. జాతీయ సమస్యగా మార్చడమేమిటన్న చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో మీడియా ఇంటర్యూలలో అమృత చేస్తున్న వ్యాఖ్యలతో ఆమెపైన ఉన్న సానుభూతి కూడా క్రమంగా కరిగిపోతోంది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో.. మారుతీరావుకే మద్దతు పెరిగిపోయింది. “ఐ సపోర్ట్ మారుతీరావ్” అని వేల కొద్దీ పోస్టులు వెల్లువెత్తుతున్నయి. ఈ పరిస్థితి చూసి… కేసులు పెడతానంటూ.. అమృత మీడియా సాక్షిగా బెదిరింపులు చేస్తున్నారు. కానీ… ఎప్పుడైతే.. ప్రణయ్ హత్యను మీడియా సెన్సేషనలైజ్ చేసిందో.. అప్పుడే చేయిదాటిపోయింది. దాన్ని సరిగ్గా డీల్ చేయలేక.. అమృత … సానుభూతి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. విగ్రహం విషయంలో రాజకీయం చేసే కొన్ని కుల సంఘాలు మినహా ఏ ఒక్కరూ మద్దతుగా రాకపోవడమే దీనికి నిదర్శనం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close