జగన్ రెడ్డి సైకోయిజానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్చర్ అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ఫ్యామిలీని జగన్ రెడ్డి పూర్తిగా దూరం పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన వెంటనే తాడేపల్లికి పిలిపించుకుని పరామర్శించారు జగన్. అంతకు ముందు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్లి పరామర్శించారు. కానీ మిథున్ రెడ్డిని జైల్లో పరామర్శించలేదు.. రిలీజయ్యాక పరామర్శించలేదు. ఎందుకిలా అన్నది పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. పెద్దిరెడ్డిపై నమ్మకం లేకుండా చేయడంలో సజ్జల ఏదైనా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి.
మిథున్‌రెడ్డిపై జగన్ రెడ్డికి నమ్మకం పోయిందా ?
జగన్ రెడ్డికి మిథున్ రెడ్డి అంటే చాలా నమ్మకం ఉండేది. అందుకే ఆయనను పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా ఆయన చేతుల మీదుగానే నడిచాయి. కానీ ఇప్పుడు లిక్కర్ స్కాములో జైలుకు వెళ్తే పట్టించుకోలేదు. ఓ సారి పరామర్శిస్తారు అని లీక్ వచ్చింది. కానీ తర్వాత వాయిదా వేసుకున్నారు. మళ్లీ అలాంటి లీక్ కూడా రాలేదు. ఇప్పుడు విడుదల అయినా పట్టించుకోవడంలేదు. తాను వెళ్లకపోయినా పిలిపించుకుని పరామర్శించి ఉండాల్సింది. కానీ అలా కూడా చేయలేదు.
ప్రెస్‌మీట్ పెట్టి జగన్ పై విధేయత ప్రకటించుకున్న మిథున్ రెడ్డి
జగన్ రెడ్డి సమయం ఇవ్వడం లేదు.. పిలవడంలేదు.. అసలు పట్టించుకోవడంలేదని క్లారిటీ రావడంతో మిథున్‌రెడ్డి వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి.. తాము జగన్ వెంటే ఉంటామని ఆయనను సీఎంను చేసుకుంటామని ప్రకటించారు. చంద్రబాబుతో ఎలాంటి ఒప్పందాలు లేవని.. తమను ఆయన చాలా కాలం నుంచి వేధిస్తున్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్‌మీటే కాస్త తేడాగా ఉంది. ఎందుకు జగన్ రెడ్డిని ఇలా కాకా పడుతున్నారు.. చంద్రబాబు కుటుంబంతో శతృత్వం ఉందని చెప్పుకుంటున్నారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ పెద్దిరెడ్డి ఇంటికి వరుసగా నేతలు వెళ్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు సహా చాలా మంది వెళ్లారు. దీంతో ఏదో జరుగుతోందని మాత్రం చాలా మందికి క్లారిటీ వస్తోంది.
సజ్జల మరోసారి పంజా విసిరారా ?
జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన వారిని దూరం చేయడంలో సజ్జల గొప్ప ప్రణాళికలు అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సారి పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి బాధ్యత తీసుకున్న చిత్తూరు, అనంతపురం జిల్లాలలో పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు తప్ప ఎవరూ గెలవలేదు. ఆ కిటుకేంటో చెప్పాలని గతంలోనే జగన్ సెటైర్లు వేశారు. జగన్ రెడ్డిలో ఉన్న అనుమానాన్ని సజ్జల పెంచి పెద్దది చేశారని ఇప్పుడు జగన్ రెడ్డి పూర్తిగా ఆ కుటుంబాన్ని వదిలేసుకునే పరిస్థితి వచ్చారని అంటున్నారు. పెద్దిరెడ్డికి బీజేపీలో చేరడం తప్ప మరో ఆప్షన్ లేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్న ఆగ్రహం ఆయన అనుచరులలో వ్యక్తమవుతోంది.