లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు ఎలా దోపిడీ చేశారో కళ్ల ముందే ఉంది. వారంతా అరెస్టులు అవుతున్నారు. వందల కేజీల బంగారు కడ్డీలు.. మనీలాండరింగ్ తో కంపెనీల్లో కోట్లు జమ చేసుకున్నారన్న వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ స్కామర్లంతా ఐదేళ్లలోనే ఎంత పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారో వైసీపీలో అందరికీ తెలుసు. పేర్ని నానికి ఇంకా బాగా తెలుసు.
అయితే ఇప్పుడు వారంతా జైలుకెళ్తూంటే పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ఆయాస పడిపోతున్నారు. వారందర్నీ అక్రమంగా అరెస్టు చేస్తున్నారని గగ్గోలు పడుతున్నారు. పేర్ని నానికి ఇందులో వాటా ఇవ్వలేదు. కనీసం తన నియోజకవర్గంలో ఇసుకను కూడా జగన్ తనకు వదల్లేదు. చివరికి రేషన్ బియ్యం మాత్రం చాన్సిచ్చారు. అక్కడా పేర్ని నాని దొరికిపోయి డబ్బులు కట్టడమే కాదు.. కేసుల్లోనూ ఇరుక్కోవాల్సి వచ్చింది. భార్యను ఎక్కడ అరెస్టు చేస్తారోనని చాలా కాలం కుటుంబంతో సహా దాక్కోవాల్సి వచ్చింది.
ఇప్పుడు వేల కోట్లు దోచుకున్న లిక్కర్ స్కామర్ల కోసం పేర్ని నాని ఆవేశపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా సరే తన పదవిని జగన్ పీకేశాడు. తన కంటే ఎక్కువగా తిట్టాడని జోగి రమేష్ కు మంత్రి పదవి చాన్సిచ్చారు. ఇప్పుడు ఆ జోగి రమేష్ మాట్లాడకుండా టీడీపీ నేతలతో కలిసి తిరిగేందుకు ప్రయత్నిస్తూ.. పేర్ని నాని మాత్రం తన విధేయత చూపాలనుకుంటున్నారు. పేర్ని ఎంత చేసినా.. ఆయనకు జగన్ దగ్గర దక్కే ప్రాధాన్యంలో తేడా ఉండదు. అనవసరంగా లిక్కర్ స్కామర్ల కోసం నోరు పారేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది?