ఆ “రంగుల ఖర్చు” ఎవరి నుంచి రాబట్టాలి…!?

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రంగులు వేయడానికి , తీయడానికి రూ. నాలుగు వేల కోట్ల ప్రజా ధనం వృధా అయిందని.. వాటిని బాధ్యులైన వారి నుంచి వసూలు చేయాలంటూ… హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అందులో నీలం సాహ్ని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌పై విచారణలో హైకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని తప్పు పట్టింది. వారిని వ్యక్తిగతంగా ప్రతివాదులుగా ఎందుకు చేర్చాలని ప్రశ్నించింది. సరిగ్గా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అధికారికంగా ఆదేశాలు ఇచ్చి మరీ.. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వైసీపీ రంగులు వేశారు. వీటికి పెద్ద మొత్తంలో ఖర్చుచేశారు. ఇలా రంగులు వేయడం.. చట్ట విరుద్ధమంటూ.. కోర్టులోపిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు… రంగుల్ని తొలగించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. అయినా మార్చలేదు. రెండు సార్లు ఇలా సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన తర్వాత .. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అప్పుడు రంగుల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చారు.

రంగుల వేయడానికి తొలగించడానికి వేల కోట్లు ఖర్చయ్యాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంత ప్రజాధనం వృధా చేయడం కరెక్ట్ కాదని.. బాధ్యులైన వారి నుంచి వసూలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఎంత ఖర్చు అయిందనేది ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. అయితే ఇప్పటికీ చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు కనిపిస్తూనే ఉన్నాయి. వివాదం సమసిపోయిందనుకున్న సమయంలో.. కొత్తగా పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలిచ్చిన వారికి ఇప్పుడు ఇబ్బందికర పరిణామం ఎదురయ్యే అవకాశం ఉందని లాయర్లు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close