బిగ్ బ్రేకింగ్ : పిన్నెల్లి అరెస్ట్..?

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌజ్ లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

బుధవారం సాయంత్రంలోగా పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో సీరియస్ గా తీసుకున్న ఈసీ పోలీసులను అలర్ట్ చేసింది. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ పిన్నెల్లి ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైద‌రాబాద్ శివారులో పిన్నెల్లి డ్రైవ‌ర్ పోలీసుల నుండి త‌ప్పించుకున్నార‌ని సమాచారంతో పోలీసులు ఆ మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.

అయితే, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని గెస్ట్ హౌజ్ లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆయనను ఏపీకి తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, పిన్నెల్లి అరెస్ట్ ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close