రవిప్రకాష్ కస్టడీ ఎందుకో పోలీసులు వాదించలేకపోతున్నారా..?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను పది రోజుల పాటు కస్టడీకి కావాలంటూ..పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. రెండు రోజుల నుంచి దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్నా…కస్టడీలో ఎలాంటి వివరాలు సేకరిస్తారో కోర్టుకు చెప్పలేకపోయారు. దాంతో బుధవారం విచారణ గురువారనికి.. గురువారం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. రవిప్రకాష్ తాను సీఈవోగా ఉన్న సమయంలో… అక్రమంగా.. బోర్డు అనుమతి లేకుండా బోనస్ కం ఎక్స్ గ్రేషియా పేరుతో కోట్లు సొంత ఖాతాలకు మళ్లించారని… అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన కేసు నమోదు చేసి…రవిప్రకాష్ ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో రవిప్రకాష్ తరపున న్యాయవాదులు మాత్రం.. పోలీసులు దురుద్దేశపూర్వకంగా కేసునమోదు చేశారని వాదిస్తున్నారు.

నిబంధనల ప్రకారమే.. టీవీ9 సీఈవోకు బోనస్ కం ఎక్స్ గ్రేషియా వచ్చిందని… రవిప్రకాష్ కే కాదు.. మిగతా అందరి డైరక్టర్లకు.. వారి వారి జీతాల స్థాయిలో… బోనస్ కం ఎక్స్ గ్రేషియా వచ్చిందని అంటున్నారు. ఈ విషయంలో తాము అన్ని రకాల పత్రాలను కోర్టు ముందు పెట్టామని రవిప్రకాష్ న్యాయవాదులు చెబుతున్నారు. అయితే రవిప్రకాష్ నుంచి ఏ వివరాలు తెలుసుకోవడానికి కస్టడీ కోరుతున్నారో…పోలీసులు కోర్టు ఎదుట సమర్థమైన వాదన వినిపించలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. రవిప్రకాష్ పై కేసు విషయంలో మౌలికమైన సందేహాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూండటంతో.. పోలీసుల తరపున న్యాయవాదులు.. వాయిదాల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా… విమర్శలు వస్తున్నాయి. శుక్రవారంకూడా.. కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఆ తర్వాత కోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

కేసును అక్రమంగా నమోదు చేశారనే వాదన వినిపించాడనికి… బోనస్ కం ఎక్స్ గ్రేషియా అక్రమం కాదని..చెప్పడానికి.. బోర్డులోని ఇతర డైరక్టర్లకు అదే సమయంలో ఇచ్చిన బోనస్ వివరాలను రవిప్రకాష్ లాయర్ల బృందం కోర్టుకు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఏ బోర్డు అనుమతి లేకుండా తీసుకున్నారని కేసు పెట్టారో.. ఆ బోర్డు.. అప్పట్లో లేదనే పత్రాలు కూడా కోర్టుకు సమర్పించనున్నట్లుగా రవిప్రకాష్ లాయర్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close