కట్టని మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు వెళ్తున్న జగన్ .. పొలిటికల్ షో చేయాలనుకున్నారు. అడ్డుకుంటున్నారని బిల్డప్ ఇద్దామనుకున్నారు. కానీ పోలీసులు ఆయనకు ్నుమతి ఇచ్చారు. వైఎస్ జగన్ కి రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. విమానాశ్రయం నుండి NAD, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా, మాకవరపాలెం కి అనుమతి ఇచ్చారు.
తాము అనుమతి ఇచ్చిన రూట్ కాకుండా.. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే మాత్రం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి 10 వాహనాలకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు, పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేయడం, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయడం చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఏదైనా గాయం, ప్రాణనష్టం లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాల్సిందేనని అనుమతిలో పేర్కొన్నారు.
పొలిటికల్ షోలు చేయడానికి మనుషుల ప్రాణాలు బలి తీసుకోవడానికి జగన్ రెడ్డి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అవసరం లేకపోయినా రోడ్ షోలు చేయడం.. హెలికాఫ్టర్ల వద్దకు మనుషుల్ని తరలించుకోవడం.. తన చుట్టూ ఎప్పుడూ తొక్కిసలాట జరిగేలా చూసుకోవడం .. జగన్ టూర్ లో ఉండే రొటీన్ స్క్రిప్ట్. దీని వల్ల ప్రాణాలు పోతున్నాయి. అయినా తమ రాజకీయం మాత్రం మార్చుకోవడం లేదు.