నీకు ఆ భాష రాదు….నీకు ఈ భాష రాదు…!

సాధారణంగా అధికార పార్టీలో ఉన్నవారుగాని, ప్రతిపక్ష నాయకులుగాని ప్రజా సమస్యల గురించి తక్కువగా, పనికిమాలిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఏదో ఒక విషయం మీద ప్రతిరోజూ ఆరోపణలు చేసుకోవల్సిందే. ఒకరినొకరు తిట్టుకోవల్సిందే. ఇలా చేస్తుంటేనే వీరు రాజకీయాల్లోనే ఉన్నారని ప్రజలు గుర్తు పెట్టుకుంటారేమో…! ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటన చేశాడో అప్పటినుంచి భాషా వివాదం రాజుకుంది. అధికార, ప్రతిపక్ష నాయకులు రోజూ రచ్చరచ్చ చేస్తున్నారు. నీకు తెలుగు రాదని ఒకళ్లంటే…నీకు ఇంగ్లిషు రాదని మరొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు తమలపాకుతో ఒకటంటే…నేను తలుపు చెక్కతో రెండంటా అనే సామెతలా కొట్లాడుకుంటున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకించిన కొందరు కరడుగట్టిన తెలుగు భాషాభిమానులు ఇప్పుడు ‘ఇంగ్లిషు మీడియం అత్యవసరం’ అంటున్నారు. ఇంగ్లిషును సమర్థించే నాయకులల్లో కొందరికి ఇంగ్లిషు రాదు. తెలుగు భాషకు వీరాభిమానులమని చెప్పుకునే నేతల్లో కొందరికి తెలుగు సరిగా రాదు. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలనే ఆలోచన జగన్‌ చేసిన గొప్ప ఆలోచన కాదు. ఆయన మానసపుత్రిక కాదు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సక్సెస్‌ స్కూల్స్‌ అనే పేరుతో పాఠశాలలు పెట్టి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాడు. కాకపోతే జగన్‌ చేసిన ఆలోచన ఏమిటంటే ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం.
కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో రెండేళ్ల పిల్లగాళ్లను నేరుగా ఇంగ్లిషు మీడియంలోనే చేరుస్తారు. వారు ఇంగ్లిషు వర్ణమాలతోనే అంటే ఏబీసీడీలు నేర్చుకోవడంతోనే చదువు ప్రారంభిస్తారు. అసలు వారికి ఆఆలు ఎలా ఉంటాయో కూడా తెలియవు. ప్రభుత్వ పాఠశాలలను ఇలా చెయ్యాలనేది జగన్‌ ఆలోచన. అప్పుడే పిల్లలకు ఇంగ్లిషు క్షణ్ణంగా వస్తుందని, చదువుల్లో దూసుకుపోతారని, ఉన్నత ఉద్యోగాలు సంపాదిస్తారని అనుకొని ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మీడియం ప్రవేశపెడుతున్నారు? బడుగు బలహీనవర్గాలవారిని. అంటే డబ్బుల్లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బీసీలు, ఎస్సీలు, ఇంకా ఇతర అనేక వెనుకబడిన వర్గాలవారు. ఇంగ్లిషు మీడియం అమలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అయినప్పటికీ నాయకుల మధ్య ఇప్పటినుంచే మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈమధ్య ఓ వైకాపా నాయకుడు లోకేష్‌కు తెలుగు రాదంటే, టీడీపీ నేత ఒకాయన జగన్‌కే తెలుగు రాదన్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం లోకేష్‌ తెలుగు భాష మీద వైకాపా నాయకులు ప్రతి రోజూ జోకులు వేసి నవ్వుకునేవారు. ఆయన్ని ఎంత ఎద్దేవా చేయాలో అంతా చేశారు. లోకేష్‌ ప్రసంగాల్లో తప్పులు దొర్లేవి. వాటిని పట్టుకొని వైకాపా నాయకులు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆయన్ని విమర్శంచేవారు తెలుగులో పండితులా అంటే అదీ కాదు. ఇదో రాజకీయ క్రీడ. చంద్రబాబుకు ఇంగ్లిషు రాదని బాబు అధికారంలో ఉనప్పుడు జగన్‌ అసెంబ్లీలోనే తీవ్ర విమర్శలు చేశాడు.
ఇంగ్లిషులో మాట్లాడితే బాబు అర్థం చేసుకోలేడని, కొన్ని పదాలకు అర్థాలు తెలియవని ఎద్దేవా చేశాడు. కేసీఆర్‌ కూడా చంద్రబాబుకు భాషా జ్ఞానం లేదని ఓ బహిరంగ సభలో విమర్శలు చేశాడు. ‘నీకు ఇంగ్లిషు రాదు…హిందీ రాదు. నేనైతే దేనికైనా సవాల్‌’ అన్నాడు. తాజాగా వైకాపా నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి లోకేష్‌నుపై విరుచుకుపడింది. ‘లోకేష్‌కు తెలుగే కాదు ఇంగ్లిషూ సరిగా రాదు’ అన్నది. తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిందే చంద్రబాబు అని, తెలుగు గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదని చెప్పింది. తెలుగు మీడియం ఎత్తేస్తున్న రాష్ట్రంలో తెలుగు వికాసానికి ఈమె చేసే కృషి ఏమిటో…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close