జగన్‌ను విమర్శించారని లోకేష్‌ను బ్యాన్ చేశారు..!

ముఖ్యమంత్రి జగన్‌ను రాజకీయంగా విమర్శించినందుకు.. అధికారిక కార్యక్రమాలకు రాకుండా లోకేష్‌ను నిషేధించాలని.. వైసీపీ నేతలు నిర్ణయించారు. ఈ వింత గుంటూరులో చోటు చేసుకుంది.  గుంటూరు జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతో పాటు… వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో అభివృద్ధి విషయాల సంగతేమో కానీ.. గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌ను సమావేశాలకు రాకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించారు.
డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని తీర్మానాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యుల అంగీకారం తెలిపారు. నిజానికి డీఆర్సీ సమావేశానికి ఎమ్మెల్సీ లోకేష్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిలకు ఆహ్వానం పంపలేదు. మళ్లీ రాకుండా తీర్మానం చేసేశారు. వైసీపీ నేతలు చేసిన తీర్మానాన్ని టీడీపీ ఎద్దేవా చేసింది. లోకేష్ అంటే అంత  భయమెందుకని.. ఆ పార్టీ ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆర్కేను ఆమె కరకట్ట కమల్ హాసన్ గా సంబోధిస్తూ సెటైర్లు వేశారు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబుని ఉరి తియ్యాలి, నడి రోడ్డు పై కాల్చాలి అంటూ మాట్లాడినప్పుడు ఈ కరకట్ట కమల్ హాసన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.  రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసుకుంటారు కానీ.. ప్రభుత్వ పరమైన కార్యక్రమాలకు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాకుండా.. ఆపడానికి తీర్మానాలు చేయడం.. చరిత్రలో ఇదే మొదటి సారి కావొచ్చన్న సెటైర్లు పడుతున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేప్ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు..!

" ఇవన్నీ కాదు కానీ నేను నిన్ను పాడు చేశానని కేసు పెట్టు... నేను కూడా నిజమేనని ఒప్పుకుని జైలుకు వెళ్తా...!" అని ఓ సినిమాలో హిరోయిన్ సిమ్రాన్‌తో కమలహాసన్ అంటాడు....

మళ్లీ దక్షిణాది వాదం అందుకున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై దూకుడుగా ఉన్న సమయంలో దక్షిణాది వాదం వినిపించేవారు. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్రం.. వాటిని మొత్తం ఉత్తరాదిలో ఖర్చు పెడుతోందని...

సుప్రీంకోర్టు చెప్పినా ఏపీ సర్కార్‌ది ధిక్కరణేనా..!?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎవరి మాటా వినాలనుకోవడం లేదు. హైకోర్టుపై నమ్మకం ఉందని.. ఏం చెప్పినా పాటిస్తామని మాటిచ్చి కూడా.. హైకోర్టు తీర్పును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అనుకూల...

ఆర్కే పలుకు : అన్నపై కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెడతారా..!?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఒక వారం గ్యాప్ తీసుకుని... "హిలేరియస్ టాపిక్‌"తో కొత్తపలుకులు వినిపించారు. అన్న జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విబేధిస్తున్న షర్మిల కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఇంత వరకూ...

HOT NEWS

[X] Close
[X] Close