‘వెంకీ మామ’ టీజ‌ర్‌: మామా అల్లుళ్ల సంద‌డి

టాలీవుడ్‌లో త‌యార‌వుతున్న మ‌రో మ‌ల్టీస్టార‌ర్ `వెంకీ మామ‌`. ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తేనే బోలెడంత సంద‌డి. ఆ హీరోలిద్ద‌రూ మామా అల్లుళ్ల‌యితే, తెర‌పైనా ఆ పాత్ర‌లే పోషిస్తుంటే ఇక చెప్పేదేముంది..? ఆ హుషారు మామూలుగా ఉండ‌దు. `వెంకీ మామ‌` టీజ‌ర్ లోనూ అదే క‌నిపించింది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రమిది. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌లు. ఈరోజు నాగ‌చైత‌న్య పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల చేశారు.

కెప్టెన్ కార్తీక్ శివ‌రామ్ వీర‌మాచినేని పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌ని ప‌రిచ‌యం చేశారు. మామా అల్లుళ్ల అనుబంధం చూపిస్తూ స‌ర‌దాగా టీజ‌ర్ మొద‌లైంది. అల్లుడు మిల‌ట‌రీకి వెళ్తాడు. అక్క‌డ అనుకోని ప‌రిస్థితుల్లో చిక్కుకుంటే అల్లుడ్నిర‌క్షించ‌డానికి మామ రంగ‌ప్ర‌వేశం చేస్తాడు. ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌ది క‌థ‌. వెంకీ అంటే అల్ల‌రి. టీజ‌ర్‌లో అది క‌నిపించింది. దాంతో పాటు హుందాద‌నం కూడా. స‌ర‌దాగా మొద‌లైన టీజ‌ర్ చివ‌రికి సీరియ‌స్‌లుక్‌లోకి వ‌చ్చేసింది. మామా అల్లుళ్ల అనుబంధాన్ని ఈ టీజ‌ర్ అద్దం ప‌ట్టింది. చైతూ – రాశీఖ‌న్నాల కెమిస్ట్రీ కంటే వెంకీ – చైతూల కెమిస్ట్రీనే అద్భుతంగా పండిన‌ట్టు అనిపిస్తోంది. ఈ సినిమాకి కావ‌ల్సింది కూడా అదే. ఈ డిసెంబ‌రులో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు...

చంపడానికి కూడా సిద్ధమంటున్న ఉద్యోగ సంఘాల రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల "సామాజిక" భక్తి, విధేయత చంపుతాం అనే హెచ్చరికల వరకూ వెళ్తోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగ సంఘ నేతలు.. అదే పనిగా మీడియా...

దీదీ కాన్సెప్ట్ : దేశానికి నాలుగు రాజధానులు..!

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీని ప్రకారం మరి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఎన్ని రాజధానులు...

బిడెన్ ప్యాకేజీ : ఒక్కో అమెరికన్ పౌరునికి రూ. లక్షన్నర..!

నల్లధనాన్నంతా వెనక్కి తెస్తాం.. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో పదిహేను లక్షలేస్తాం అని బీజేపీ చెప్పింది కానీ.. ఇప్పటి వరకూ వేసింది లేదు.. కానీ నల్లధనం మొత్తం వెనక్కి తెచ్చామని కూడా చెప్పారు. దీంతో...

HOT NEWS

[X] Close
[X] Close