ఐవైఆర్‌కి సదుద్దేశం లేదన్న హైకోర్టు..!

ఐవైఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రజాప్రయోజనం కోసం అంటూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో.. ఐవైఆర్ కృష్ణారావు పడిన హైరానా.. .హైకోర్టులో పిటిషన్ వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్‌నెస్ అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థకు అధ్యక్షుని హోదాలో… హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం.. ” ప్రభుత్వ అధికారులకు కనీస పదవి కాల భద్రత” కల్పించాలని ఆయన కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ వేయడంలో.. సదుద్దేశం కనిపించడం లేదని స్పష్టం చేస్తూ కొట్టి వేసింది. అఖిలభారత సర్వీసు అధికారుల విషయంలో ఇప్పటికే.. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఒక వేళ అమలు కాలేదని భావిస్తే.. సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చని సూచించింది.

బదిలీపై అసంతృప్తి ఉంటే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించవచ్చని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు పిటిషన్ కొట్టి వేయడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్తానని ఐవైఆర్ చెప్పుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపుపై.. ఎల్వీ కన్నా . .ఐవైఆర్ ఎక్కువగా.. ఆవేశపడుతున్నారు. ఎల్వీని తొలగించినప్పుడే.. సోషల్ మీడియాలో.. సీఎంవో అధికారుల బాధ్యత లేని అధికారం అంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన తర్వాత.. పత్రికల్లో ఆర్టికల్స్ రాశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అధికారుల బదిలీలు ఆయన చేతుల మీదుగానే జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ఇలా ఎవరికైనా.. కరెండేళ్లు పదవీకాల భద్రత ఇవ్వాలన్న సిఫార్సును ప్రభుత్వానికి చేయలేదు.

ఐవైఆర్ కృష్ణారావు నిజానికి.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు..నిన్నామొన్నటి వరకూ సన్నిహితుడే. చంద్రబాబుతో చెడిన తర్వాత ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. వైసీపీ హైకమాండ్ కు దగ్గరయ్యారు. సాక్షి మీడియాలో కావాల్సినంత స్పేస్ పొందారు. వైసీపీలో చేరుతారని అనుకున్నారు కానీ.. ఆయన బీజేపీని ఎంచుకున్నారు. ఇప్పుడు.. వైసీపీ సర్కార్ ను.. కోర్టుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close