ర‌ష్మిక ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు

రిలేరు నీకెవ్వ‌రు టీజ‌ర్ అద‌ర‌గొడుతోంది. సోష‌ల్ మీడియా రికార్డుల‌న్నీ ఈ టీజ‌ర్‌వే. ఆల్ ఇండియా ట్రెండింగ్‌లో ఈ టీజ‌ర్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. మ‌హేష్ బాబు పేల్చిన డైలాగులు, చివ‌ర్లో ప్ర‌కాష్‌రాజ్ పంచ్… భ‌లే పండాయి. అంతా బాగానే ఉంది. కానీ క‌థానాయిక ర‌ష్మిక మాత్రం ఒక్క‌టంటే ఒక్క ఫ్రేములోనూ క‌నిపించ‌లేదు. దాదాపు 90 సెక‌న్ల టీజ‌ర్ ఇది. దాన్ని టీజ‌ర్ అన‌డం కంటే మినీ ట్రైల‌ర్ అని పిల‌వ‌డ‌మే సమంజ‌సం. 30 సెక‌న్ల టీజ‌ర్‌లో హీరోయిన్ క‌నిపించ‌డ‌లేదంటే పెద్దగా డౌట్లు రావు. కానీ 90 సెక‌న్ల టీజ‌ర్‌లో మిస్ అవ్వ‌డం నిజంగా చ‌ర్చ‌నీయాంశమే.

విజ‌య‌శాంతి, ప్ర‌కాష్‌రాజ్‌ల‌కు ఒక్కో డైలాగ్ చెప్పున ఇచ్చిన ద‌ర్శ‌కుడు క‌నీసం ర‌ష్మిక‌ని చూపించ‌నైనా చూపించ‌లేదు. దాంతో కాస్త లోటు క‌నిపించింది. ర‌ష్మిక ఫ్యాన్స్ సైతం… మా హీరోయిన్ లేదేంటి? అని హ‌ర్ట‌య్యారు. ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్‌లో ర‌ష్మిక మిస్సింగ్ కేసు.. జోరుగా న‌డుస్తోంది. ఈ సినిమా నుంచి మ‌రో టీజ‌ర్ రావాలంటే కనీసం నెల రోజులైనా ప‌డుతుంది. విడుద‌ల‌కు ముందు డైరెక్టుగా ట్రైల‌ర్ విడుద‌ల చేసేసినా ఆశ్చర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. అంత వ‌ర‌కూ ర‌ష్మిక ఫ్యాన్స్ ఓపిక ప‌ట్టాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు....

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close