హరీష్ చుట్టూ రాజకీయం..! అంతకంతకూ రెచ్చగొడుతున్న విపక్ష నేతలు..!!

తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావుపై.. విపక్ష పార్టీ నేతలు విభిన్న పద్దతిలో విరుచుకుపడుతున్నారు. హరీష్ రావుపై తీవ్రంగా విమర్శలు చేయడం లేదు. సాఫ్ట్ గా మాట్లాడి.. మొత్తానికే మోసం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిలు… హరీష్ రావుపై సానుభూతి చూపుతూ.. ఆయనను దూరం పెడుతున్నారని చేసిన వ్యాఖ్యలు… హంగ్ వస్తే ఆయనే సీఎం అవుతారని… చేస్తున్న ప్రకటనలు.. హరీష్‌రావుకు లోలోపల సంతోషాన్ని కలిగిస్తున్నాయేమో కానీ.. బయట మాత్రం ఒంటికి కారం రాసినట్లుగా ఉంటోంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మామతో సంబంధాలు మరింత దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే తీవ్రంగా.. విరుచుకుపడుతున్నారు. తనపై సానుభూతి చూపించిన వాళ్లనూ వదిలి పెట్టడం లేదు.

టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి.. మరోసారి హరీష్ కు సానుభూతిగా.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ తన రాజకీయ వారసుడిగా మంత్రి హరీశ్‌రావును కేటీఆర్‌ ప్రకటిస్తే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని సవాల్ చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అధికార దాహంతోనే కేటీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్‌తో ఎలాంటి విబేధాల్లేవని..కేటీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేసిన.. రేవూరి.. ” మీ బావంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు తొలి నుంచి కేసీఆర్‌కు అండగా ఉన్న హరీశ్‌ను సీఎం రాజకీయ వారసుడిగా మీరు ప్రకటిస్తారా? ఆ దమ్ము, ధైర్యం ఉందా? నీతి, నిజాయతీని నిరూపించుకోవాలంటే ముందు ఆ ప్రకటన చేయండి. అలా చేస్తే ఇప్పటివరకు నేను మాట్లాడినవన్నీ భేషరతుగా ఉపసంహరించుకుంటా…”నని ఘాటుగా ప్రకటించేశారు.

మరో వైపు.. కేసీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు ఆర్థిక సాయం చేస్తానన్నాని ప్రకటించిన గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి.. కొత్తగా మరో బాంబు పేల్చారు. గతంలో తానూ, హరీశ్ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామంటూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడిన దానితో సహా అన్నింటికీ ఆధారాలున్నాయన్నారు. హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని వంటేరు ప్రకటించారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను రెడీయని.. హరీశ్ సిద్ధమా? అని ప్రతాప్ రెడ్డి సవాల్ చేశారు. మొత్తానికి హరీష్ ను టార్గెట్ చేసుకున్నట్లు .. నేతలు ప్రకటనలు చేస్తున్నారు.. కానీ అసలు విషయం మాత్రం.. కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా.. ఈ నేతలు వ్యూహం ప్రకారమే.. సవాళ్లు చేస్తున్నారు. మరి హరీష్ రావు.. దీన్ని ఎలా ఎదుర్కొంటారో మరి..! ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close