కాంగ్రెస్సే తేల్చుకోలేకపోతోంది..! ఇక టీజేఎస్, సీపీఐల సంగతి పట్టించుకునేదెవరు..?

అభ్యర్థుల ఎంపిక కోసం.. కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. రోజుల తరబడి చర్చలు జరుపుతోంది కానీ..తేల్చుకోలేకపోతోంది. ఇక్కడ మిత్రపక్షాలు మాత్రం కిందా మీదా పడిపోతున్నాయి. కూటమిలో ఉండాలో వద్దో తేల్చుకోవాలంటున్నాయి. కూటమిలో మిగతా పార్టీలకు దీపావళి నాటికి స్పష్టత వస్తుందని భావించినప్పటికీ సీపీఐ, తెలంగాణా జనసమితి సీట్ల వ్యవహారం తేలలేదు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై సీపీఐ, టీజేఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహాకూటమి సీట్ల సర్దుబాటు, టీజేఎస్ , సీపీఐకి ప్రతిపాదించిన స్థానాలపై కోదండరాం, సీపీఐ నేతలు హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు.

మహాకూటమిలో సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ విషయంలో అసలు చర్చే లేదు. టీడీపీ తమకు ఏ స్థానాలిస్తారో ఎప్పుడో ఖరారు చేసుకుంది. అభ్యర్థుల్ని నిర్ణయించుకుంది. కొన్ని చోట్ల ప్రచారం కూడా ప్రారంభించింది. కానీ.. సీపీఐ, టీజేఎస్‌లు అడుగుతున్న స్థానాలకు, ఇస్తామన్న వాటికి… చాలా తేడా ఉంది. సీపీఐ తమకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపింది. మూడు సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ చెబుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, వైరా ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. చాడ వెంకటరెడ్డి పోటీకి రెడీ అయిన హుస్నాబాద్ ఇవ్వకపోతే.. కూటమి నుంచి అయిన వెళ్లిపోవాలని సీపీఐ అనుకుంటోంది. ఈ విషయాన్ని సీపీఐ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మూడు స్థానాలతో పాటు భవిష్యత్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహాకూటమి సీట్ల సర్దుబాటు, సీపీఐ, టీజేఎస్‌కు కేటాయించే స్థానాలపై చర్చించేందుకు కోదండరాం సీపీఐ కార్యాలనికి వెళ్లారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, జాతీయ నేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపైన చర్చించారు. టీజేఎస్ 14 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. 9 సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చి చెప్పింది. ఇచ్చే 9 స్థానాల్లోను తెజస కోరేసీట్లు కేవలం 5 మాత్రమే ఉన్నాయని.. రెండు కోరనివి, ఏమాత్రం బలంలేని మరో రెండు స్థానాలను ఇస్తామని చెప్పడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌లో సీట్ల పంచాయతీ తేలిన తర్వాత వీరి గురించి ఆలోచించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close