జోగి రమేష్‌కు సక్సెస్‌ఫుల్‌గా రిమాండ్ పడేలా చేయడంలో వైసీపీ ఆస్థాన లాయర్, కార్యకర్తలకు న్యాయపరమైన సాయం అందించే టీమ్‌కు లీడర్ అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఆయన ఎవరి కోసమైనా వాదిస్తే వారు రిమాండ్ కు వెళ్లిపోవడం ఖాయమని అందరికీ ఓ స్పష్టత ఉంది. మామూలు అవినీతి కేసులో జైలుకెళ్లిన ఐపీఎస్ సంజయ్ ఇప్పటికీ బయటకు రాలేకపోయారు. చాలా మంది నెలల తరబడి జైల్లో ఉండి బిక్కుబిక్కుమంటూ బయటకు రావాల్సి వచ్చింది.
అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాయరేనా అని ఆయన వాదనలు కోర్టుల్లో విన్నవారికి మొదటగా డౌట్ వస్తుంది.ఆయన లా పాయింట్లు చెప్పరు. సెక్షన్లు ఉదహరించరు.. కానీ న్యాయమూర్తులను దబాయిస్తారు. రాజకీయ పార్టీల వాదనల తరహాలో ఆయన వాదనలు ఉంటాయి. చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టులో సైతం ఆయన బెదిరింపుల వాదనలపై అక్షింతలు పడ్డాయి. అలాంటి లాయర్ ను కొంత మంది సెలక్టడ్ నేతలకు కేటాయిస్తోంది వైసీపీ నాయకత్వం.
జోగి రమేష్ కోసం నిరంజన్ రెడ్డిని పిలవొచ్చు.. నాగార్జునరెడ్డిని పిలవొచ్చు లేదా మరో సీనియర్ లాయర్ ను పిలవొచ్చు కానీ.. పొన్నవోలును మళ్లీ పిలవడంతో జోగి రమేష్ ఏ విధంగానూ బయటకు రాకూడదని వైసీపీ నాయకత్వం అనుకుందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అరెస్టుల సమయంలో పొన్నవోలను రెడీ కావాలని సంకేతాలు ఇచ్చారంటే.. వారిని వైసీపీ రాజకీయంగా బలి చేసి.. తాము లబ్ది పొందాలని డిసైడ్ అయిందని అనుకోవచ్చు.
