వర్షం సినిమా రిలీజ్ గురించి బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ చెప్పిన మాటలు అందరికీ గుర్తే. ”వర్షం సినిమా అప్పుడు.. మీరు (బాలయ్య లక్ష్మీ నరసింహా) ఓ పక్కన, చిరంజీవి గారు (అంజి) ఓ పక్కన.. మీతో ఎందుకో మనం తర్వాత వేద్దామంటే ఎం ఎస్ రాజు వేసేశారు’ అని ప్రభాస్ చెబితే.. మీరు రాజులు కదా, మాట వినరు’ అని బదులు చెప్పడం నవ్వులు పూయించింది.
నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలో అది ఒక ఎపిక్ క్లాష్. లక్ష్మీ నరసింహా, అంజి రెండూ భారీ సినిమాలే. ముఖ్యంగా భారీ గ్రాఫిక్స్ తో తీసిన అంజిపై చాలా అంచనాలు. ఈ మధ్యలోకి వచ్చింది ప్రభాస్ వర్షం. లక్ష్మీ నరసింహా మంచి హిట్. అంజి సినిమా మాత్రం చాలా నిరాశ పరిచింది. అయితే వర్షం మాత్రం మామూలుగా ఆడలేదు. ప్రభాస్ కి ఫస్ట్ బాక్సాఫీస్ పడింది ఈ సినిమాతోనే. ప్రభాస్ స్టార్డమ్ పెంచిన సినిమా అయ్యింది వర్షం.
2004 సంక్రాంతికి కనిపించిన ఆ క్లాష్ ఇప్పుడు 2026లో రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. చిరంజీవి శంకర వరప్రసాద్ ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ చేసారు. ప్రభాస్ రాజాసాబ్ పై ఓ డౌట్ వుండేది. కానీ నిర్మాత విశ్వప్రసాద్ అఫీషియల్‌గా జనవరి 9న వస్తుందని ఖారారు చేశారు.
ఇక సెప్టెంబర్ 25న రావాల్సిన బాలయ్య అఖండ 2 అఫీషియల్‌గా వాయిదా పడింది. కొత్త డేట్ చెప్పలేదు కానీ.. అఖండ లాంటి సినిమాకి సరైన సీజన్ సంక్రాంతి. పండక్కి మూడు పెద్ద సినిమాలకు అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో బాలయ్య అఖండ 2 సంక్రాంతి రిలీజ్ పెట్టుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగితే మాత్రం పండక్కి బాలయ్య, చిరు, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.