‘మా’ నిధుల కోసం ముందుకొచ్చిన ప్ర‌భాస్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కి సొంత భ‌వ‌నం ఇప్పటి వ‌ర‌కూ లేదు. ‘మా హయాంలో సొంత భ‌వ‌నం నిర్మిస్తాం..’ అంటూ చాలామంది హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క‌రూ నెర‌వేర్చ‌లేక‌పోయారు. అయితే శివాజీ రాజా మాత్రం ‘మా’ భ‌వ‌నం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశారు. మ‌హేష్ బాబు తో అమెరికాలో ఓ ప్రోగ్రాం నిర్విహించాల‌ని, ఆ డ‌బ్బుతో నిధిని పెంచుకోవాల‌ని చూశారు. అయితే కార్యాచ‌ర‌ణ‌లో లోపం వ‌ల్ల మ‌హేష్ పోగ్రాం ర‌ద్దు అయిపోయింది.

ఇప్పుడు శివాజీ రాజా టర్మ్ అయిపోయింది. ఈనెల 10న ‘మా’ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆ త‌ర‌వాత కొత్త అధ్య‌క్షుడు ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. శివాజీ రాజా – న‌రేష్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు ‘మా’ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వుతారు. అయితే ఎవ‌రు పీఠ‌మెక్కినా.. ఈ యేడాది విదేశాల్లో `మా` ఓ భారీ షోని నిర్వ‌హించ‌బోతోంది. అందులో ప్ర‌భాస్ పాల్గొన‌బోతున్నాడు. ప్ర‌భాస్ తో పాటు నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టారూ ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటారు. టాలీవుడ్ లో మ‌హేష్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, ప్ర‌భాస్‌కీ అంతే ఉంది. ‘బాహుబ‌లి’ త‌ర‌వాత అది మ‌రింత పెరిగింది. మ‌హేష్‌తో చేయాల‌నుకున్న కార్య‌క్ర‌మం అభాసుపాల‌వ్వ‌డంతో `మా` పెద్ద‌లు ప్ర‌భాస్‌కి క‌లిశారు. ప్ర‌భాస్ కూడా ‘మా’ కోసం నిధుల్ని సేక‌రించే బాధ్య‌త తీసుకున్నాడు. ప్ర‌భాస్ కాల్షీట్లని బ‌ట్టి.. ఎప్పుడు, ఎక్క‌డ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్న‌ది డిసైడ్ అవుతారు. ప్ర‌భాస్ వ‌చ్చాడంటే.. త‌ప్ప‌కుండా ఆ షో హిట్ట‌యి తీరుతుంది. ప్ర‌భాస్ ద‌య‌తో అయినా ‘మా’కి సొంత భ‌వనం అనే కోరిక నెర‌వేరుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ రోజున రాపిడో ఉచిత సేవలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాపిడో ఉచిత సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. సోమవారం...

కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు …విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని...

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

HOT NEWS

css.php
[X] Close
[X] Close