పీకే Vs క‌ర‌ణ్ థాప‌ర్… సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఇంట‌ర్వ్యూ!

గ‌త కొంత‌కాలంగా మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్… దేశంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని ఏ పార్టీ పొజిష‌న్ ఏంటీ అన్న వాటిపై కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ క‌ర‌ణ్ థాప‌ర్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో క‌ర‌ణ్ థాప‌ర్ స్టైల్ ప్ర‌శ్న‌ల‌కు పీకే త‌డ‌బ‌డ‌క త‌ప్ప‌లేదు.

మీరు ప్ర‌జ‌ల‌నాడిని చెప్పుకుంటూ వ‌స్తున్నారు… మ‌రీ, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ఓడిపోతుంద‌ని చెప్పారు. కానీ అక్క‌డ కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ‌లోనూ బీఆర్ఎస్ గెలుస్తుంద‌న్నారు. కానీ ఓడిపోయింది… వీటి సంగ‌తేంటీ అని ప్ర‌శ్నించారు.

ఇందుకు పీకే తాను హిమాచ‌ల్ లో కాంగ్రెస్ ఓడిపోతుంద‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌ని… అదంతా మీడియా సృష్టేనంటూ కామెంట్ చేశారు. కానీ కర‌ణ్ త‌న‌దైన స్టైల్ లో గుచ్చి గుచ్చి అడుగుతూ, డేట్ తో స‌హా చెప్తూ… మీరు కామెంట్ చేశారు అంటూ పీకేను ప్ర‌శ్నించ‌గా, పీకే కాదంటే కాదు… నేను అన‌లేదంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఈ ఇంట‌ర్వ్యూ బిట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కొంద‌రైతే క‌ర‌ణ్-పీకే ఇంట‌ర్వ్యూలో పీకే కామెంట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ పెట్టి మ‌రీ హోరెత్తిస్తున్నారు.

https://x.com/rohini_sgh/status/1793345332677595150?s=46

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close