‘ఆదిపురుష్‌’.. వ్య‌వ‌హారం స్పీడుగానే వుంది

ప్ర‌భాస్ కొత్త సినిమా… ‘ఆది పురుష్‌’ ప్ర‌క‌ట‌న ఈమ‌ధ్యే వ‌చ్చింది. ప్ర‌భాస్ చేతిలో సినిమాలు ఉండ‌డం, ఇది భారీ ప్రాజెక్టు కావ‌డంతో – `ఆదిపురుష్‌` ప‌నులు మెల్ల‌మెల్ల‌గా మొద‌ల‌వుతాయ‌నుకున్నారంతా. కానీ… వ్య‌వ‌హారం స్పీడుగానే వుంది. `ఆది పురుష్‌`కి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లైపోయాయి. ఇప్పుడు చిత్ర‌బృందం మ‌రో అడుగు ముందుకేసింది. కొన్ని ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ విజువ‌ల్ ఎఫెక్ట్స్ కంపెనీల‌తో.. చిత్ర‌బృందం సంప్ర‌దింపులు మొద‌లెట్టింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. బ‌డ్జెట్ లో స‌గం వాటికే ఖ‌ర్చు పెట్టబోతున్నారు. అందుకే.. ముందుగా ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాత విజువ‌ల్ ఎఫెక్స్ కంపెనీలు ప‌రిశీలించి, వాటితో ఒప్పందాలు కుదుర్చుకోవ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `రాధే శ్యామ్‌` సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్త‌యి, విడుద‌ల కావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఈలోగానే.. ‘ఆదిపురుష్‌’ సెట్స్‌పై వెళ్ల‌నుంద‌ని టాక్‌. 2021 ప్ర‌ధ‌మార్థంలోనే ఆదిపురుష్ షూటింగ్ మొద‌లెట్టేస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌తినాయ‌కుడిగా ప‌లువురు పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ల‌లో ఒక‌రిని త్వ‌ర‌లోనే ఖ‌రారు చేసి, అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వియ్యంకుడి తరఫున విక్టరీ వెంకటేష్ ప్రచారం..!!

లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ సినీ స్టార్లు కూడా ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. తమ బంధువులను ఎన్నికల్లో గెట్టేక్కించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా టాలీవుడ్...

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close