ప్రియమణి కూడా బయపెడుతుందట

పెళ్లైన కొత్తలో హీరోయిన్ గా పరిచయమైన ప్రియమణి తెలుగులో కొంతకాలం హాట్ గాళ్ గా హవా కొనసాగించినా ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తప్ప స్టార్ హీరోల సినిమాల్లో నటించే చాన్స్ దక్కించుకోలేదు. ఇక కెరియర్ దాదాపు అయిపోయింది అనుకున్న టైంలో బాలయ్యతో ‘మిత్రుడు’ సినిమాలో జత కట్టినా లాభం లేకుండా పోయింది. కొంతకాలంగా ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతున్న ఈ భామ ప్రస్తుతం మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. మొన్నటిదాకా ప్రేమ, పెళ్లి అని హడావిడి చేసి అది కాస్త కుదరకపోయే సరికి తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టనుంది.

అయితే తెలుగులో ఆఫర్లు రాకున్నా అమ్మడికి కన్నడలో భలే ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కాంచన -2 కన్నడ రీమేక్లో ఉపేంద్రకు జోడీగా నటించబోతుంది ఈ భామ. ముందు రాధికా పండిట్, అవంతికా శెట్టి పేర్లు వినపడ్డా ఫైనల్ గా ఉపేంద్ర ప్రియమణిని ఓకే చేశాడట. అయితే ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న ఫీమేల్ లీడ్ రోల్ సినిమాలతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తుంది ప్రియమణి. మరి దెయ్యం పాత్రలో అమ్మడు ఎలా బయపెట్టబోతుందో చూడాలి.

ఇక ఇదే కాకుండా బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సరైనోడు సినిమాలో కూడా ప్రియమణి ఓ స్పెషల్ ఐటం సాంగ్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఫేడవుట్ అయిన ఈ భామ మళ్లీ ఫాంలోకి రావడం ఆమె అభిమానులకు సంతోషించ దగ్గర్ వార్తే అయినా మరి అమ్మడు ఈ చాన్సులనైనా సరిగా వాడుకుని సూపర్ క్రేజ్ సంపాధించాలని కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com