అమీతుమీ.. ఈ కాన్ఫిడెన్స్ ఏమి??

ఈవారం విడుద‌ల అవుతున్న‌చిత్రం అమీతుమీ. ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. క్లాసీ డైరెక్ట‌ర్ అనిపించుకొన్న ఇంద్ర గంటి మోహ‌న‌కృష్ణ నుంచి వ‌స్తున్న చిత్ర‌మిది. సో… ఫ్యామిలీ ఆడియ‌న్స్ త్వ‌ర‌గా క‌నెక్ట్ అయిపోతారు. మ‌ల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి బాగానే టికెట్లు తెగే అవ‌కాశం ఉంది. పైగా.. జెంట‌ల్‌మెన్ సినిమా త‌ర‌వాత ఇంద్ర‌గంటి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అయితే.. నిర్మాత‌లు మాత్రం ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకోవ‌డంపైనే మొగ్గు చూపారు. కొన్ని ఏరియాలు త‌ప్ప ఎక్క‌డా అమ్మ‌లేదు. దాంతో పాటు.. శాటిలైట్ కూడా ఇవ్వ‌లేదు. ఇంద్ర‌గంటి సినిమా అంటే… ఎంత కాక‌పోయినా క‌నీసం రూ.1.5 కోట్ల‌యినా శాటిలైట్ రూపంలో ద‌క్కించుకోవొచ్చు. శాటిలైట్‌ని అమ్ముకొన్నా స‌గం బ‌డ్జెట్ రాబ‌ట్టుకొనే వీలుంది. అయితే… ఈ సినిమాని అమ్మ‌డానికి ప్రొడ్యూస‌ర్లు ముందుకు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇంద్రగంటి సినిమాలు టీవీలో సూప‌ర్ హిట్‌. అష్టాచ‌మ్మాకి ఇప్ప‌టికీ రేటింగులు బాగానే వ‌స్తాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏమాత్రం ప్ర‌భావితం చూపించ‌లేని గోల్కొండ హైస్కూల్ కూడా టీవీలో బాగానే ఆడింది. అందుకే.. అమీ తుమీ శాటిలైట్‌ని నిర్మాత ఇంకా ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. విడుద‌ల‌య్యాక ఇంకా మంచి రేటు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌క‌మో ఏమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close