ప్రొ.నాగేశ్వర్ : డిక్లరేషన్లు బీసీలకు మేలు చేస్తున్నాయా…?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పుడు బీసీల చుట్టూ తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జయహో బీసీ సదస్సును నిర్వహించింది. భారీగా వరాలు ప్రకటించింది. పోటీగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ గర్జన నిర్వహించింది. టీడీపీ కంటే భారీగా వరాలు ప్రకటిస్తూ.. డిక్లరేషన్ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే.. ఇవి.. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా… ఉన్నతికి ఉపయోగపడతాయా.. అన్నది చాలా మంది అర్థం కాని విషయం.

బీసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీల విన్యాసాలు..!

మండల్ కమిషన్ కానీ.. ఇతర నివేదికల ప్రకారం.. బీసీలు యాభై శాతం మందికిపైగా ఉంటారు. వీరిలో ఎక్కువ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఆ పార్టీకి బీసీల్లో మంచి పట్టు ఉంది. ఇది నేను చెబుతున్నది కాదు… తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కూడా.. ఎన్టీఆర్ హయంలోనే బీసీలకు మేలు జరిగిందని ప్రకటిచారు. ఇలా తమకు బీసీల్లో ఉన్న ఆదరణను. .. మరింత సుస్థిరం చేసుకోవాలనేది తెలుగుదేశం ప్రయత్నం. ఓ కులంలో ఉన్న వారందరూ.. ఒకరికే ఓటేస్తారని చెప్పలేం. అన్ని కులాల్లో అందరికీ ఓటేసేవారు ఉన్నారు. కేసీఆర్‌కు .. ఆయన కులమే ఓటేస్తే గెలవలేదు కదా..! కమ్మ ఓటర్లలో మెజార్టీ తెలుగుదేశం వైపు ఉన్నా… టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసేవారు ఉన్నారు. బీసీల్లోని కొన్ని కులాల్లో… టీడీపీకి ఎడ్జ్ ఉంది. దీన్ని తగ్గించాలనేది.. జగన్ ప్రయత్నం. ఈ క్రమంలోనే ఆయన ఓబీసీ కమిషన్ అంటూ.. కొత్త ప్రకటన చేశారు. సహజంగా… బీసీల్లో కాపులను కలపడానికి.. ఇప్పటికే ఆయా కేటగరిలో ఉన్న వారు వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోడానికి.. జగన్ ఇలాంటి ప్రకటన చేశారు. అందువల్ల బీసీలను ఆకట్టుకోవడానికి.. ఎవరి ప్రయత్నాలు .. వారు చేస్తున్నారు.

బీసీల వెనుకబాటుకు కారణం ఏమిటి..?

బీసీల జనాభా యాభై శాతం ఉన్నప్పటికీ.. దానికి తగ్గ స్థాయిలో రాజకీయ అవకాశాలు రావడం లేదు. కులం జనాభా ప్రకారం.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాలని చెప్పడం లేదు కానీ… సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యం, సంఖ్యాబలం దృష్ట్యా… వారికి ఎందుకు రాజకీయ అవకాశాలు రావడం లేదు..?. ఉమ్మడి రాష్ట్రంలో కానీ… ఇప్పుడు కానీ.. ఓ బీసీ ముఖ్యమంత్రి లేరు. బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలు బాగుపడతారని చెప్పడం లేదు. ఆ మాటకొస్తే.. రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు అయ్యారు.. ఆ ప్రాంతం వెనుకబడే ఉంది. ఇలా ఎందుకనేది సమాధానం లేదు. అందుకే.. బీసీలు ముఖ్యమంత్రి అయితేనో..మరో కారణంతోనే… వారు అభివృద్ధి చెందుతారని చెప్పలేం కానీ.. రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో.. వారికి తగినంత ప్రాధాన్యం లభించాలి. ఇప్పుడు లభించడం లేదు.. ఎందుకు లభించడం లేదనే విషయం మనం గుర్తిచాంలి..!. బీసీల్లో ఎక్కువ మందికి.. వనరులు తక్కువ ఉంటాయి. వీరికి ఇవి దక్కేలా చూడాలి.

విద్యా, నైపుణ్యాల పరంగా వారిని మెరుగుపర్చడానికి ఏం చేస్తున్నారు..?

బీసీలు సహజంగా.. తరాలుగా అలవాటైన వృత్తులకే పరిమితమవుతూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ఆ వృత్తులు కూడా.. భారీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దుస్తుల తయారీ.. నుంచి హెయిర్ సెలూన్ల వరకూ..కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి. రిలయన్స్ కూడా.. చివరికి హెయిర్ సెలూన్లను ప్రారంభించడానికి ప్రయత్నించింది. ఇక మత్య్సకారులు… తమ సంప్రదాయ రీతిలో చేపల వేట సాగిస్తూండగా.. వారికి పోటీగా.. పెద్ద పెద్ద బోట్లతో కాంట్రాక్టర్లు వచ్చేశారు. ఇలా..మారుతున్న పరిస్థితుల్లో… వారికి ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది. లేకపోతే.. ఉన్న వృత్తుల్లోనే వారు మరింత అభివృద్ధి చెందేలా ప్రయత్నించారు. అలాగే.. ఆయా వర్గాలుకు.. ఉన్నతమైన చదువు అందించగలగాలి. ఎలా వారికి..ఉన్నతమైన చదువు అందించగలరు..? అనేది ప్రయత్నింంచాలి. కులవృత్తులు చేసుకునే వారికి..మార్కెటింగ్ నైపుణ్యం పెంపొందించే ప్రయత్నం చేయాలి. వీటన్నింటినీ పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి.

ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్న పార్టీలు..!

దురదృష్టవశాత్తూ.. ఇప్పుడు.. బీసీలను బీసీలుగా చూసే.. రాజకీయం జరగడం లేదు. వారిని ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారు. టీడీపీ ఇప్పుడు అనేక హామీలిస్తోంది. నాలుగేళ్ల పాటు ఏం చేసింది. అలాగే.. ఇప్పుడు వైసీపీ ప్రకటించిన హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లలోం ఏం చేసింది. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో.. బీసీల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. వారిని రాజకీయంగా…ఆర్థికంగా.. సామాజికంగా.. బలోపేతం చేయడంలో… చిత్తశుద్ధితో పని చేయడం లేదు. ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.