మైత్రీ మూవీస్ కొత్త టెన్షన్?

రంగస్థలం హిట్ తో మరీ భారీగా లాభాలేమీ చేసుకోలేదు మైత్రీ మూవీస్. ఎందుకంటే సినిమాను కాస్త రీజనబుల్ రేట్లకే ముందుగా అమ్మేయడం వల్ల బయ్యర్లు ఎక్కువగా లాభపడ్డారు. అయితే ఒకటి రెండు ఏరియాలు చేతిలో వుండడం, కొద్దిగా ఓవర్ ఫ్లోస్ రావడం వల్ల మైత్రీ కూడా హ్యాపీనే.

అయితే నగదుకన్నా మైత్రీ ఎక్కువ లాభపడింది సుకుమార్ తో మరో సినిమా చేసే అవకాశం వుండడం, ఆ అవకాశాన్ని వాడుకుని మహేష్ తో సినిమాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించడం. కానీ అంతలోనే ఆ ఆనందం ఆవిరయిపోయే ప్రమాదం ఏర్పడింది. సుకుమార్ తన వ్యవహారాలు వేరే వైపు మళ్లించి, అసిస్టెంట్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం మొదలుపెట్టారు.

దాంతో మహేష్ సినిమాకు స్క్రిప్ట్ రెడీకాలేదు. సుకుమార్ చేస్తానన్న పీరియాడిక్ లైన్ మహేష్ వద్దన్నారు. ఇలాంటి టైమ్ లో దర్శకుడు అనిల్ రావిపూడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించేసింది. దాదాపు ఈ ప్రాజెక్టు ఖాయం అయిపోయింది. అయితే మైత్రీని కలవరపెడుతున్నది ఇది కాదు.

సుకుమార్-మహేష్ ప్రాజెక్టును ఆ తరువాత అయినా పట్టాలు ఎక్కించగలమా? లేదా? అన్నది. ఎందుకంటే సీన్ లోకి అనిల్ రావిపూడి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఒక్క బ్లాక్ బస్టర్ తో వచ్చేసాడు. ఆ సినిమా అయ్యేలోగా మహేష్ ఆలోచన ఎలా మారుతుందో? అన్నదే మైత్రీ కొత్త టెన్షన్ గా వుందని తెలుస్తోంది. మరోపక్కన నిర్మాత అల్లు అరవింద్-పరుశురామ్ కాంబినేషన్ లో సినిమా చేయమని మహష్ ను అడుగుతున్నట్లు వార్తలు వున్నాయి.

మరోపక్కన రాజమౌళి-కెఎల్ నారాయణ సినిమా ఎప్పటి నుంచో పెండింగ్ లో వుంది. వచ్చే మే నాటికి రాజమౌళి ఫ్రీ అయిపోతారు. అలాగే కొరటాల శివ కూడా జనవరి వేళకు దాదాపు ఫ్రీ అవుతారు. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మహేష్ సినిమా కూడా ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. ఆయన కూడా ఈ ఏడాది చివరకు అవైలబుల్ గా వుంటారు. ఇలా చాలా మంది మహేష్ కు ఆప్షన్ గా కనిపిస్తారు.

ఇలాంటి టైమ్ లో సుకుమార్ సరైన లైన్, రెడీ మేడ్ స్క్రిప్ట్ తో కనుక లేకపోతే, మైత్రీ మూవీస్ ఆశలు గల్లంతు అవుతాయి. అదే ఇప్పుడు మైత్రీ మూవీస్ టెన్షన్ గా వున్నట్లు తెలుస్తోంది. అందుకే మహేష్ బాబు గుడ్ బుక్స్ లో ఎలాగైనా వుండాలని కిందా మీదా అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close