శివ‌సేన త‌గ్గిన‌ట్టు కాదు… భాజ‌పా నెగ్గిన‌ట్టూ కాదు!

శివ‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ… ఆ రెండు పార్టీలూ ఒకే తానులో ముక్క‌లే. అయితే, గ‌త కొన్నాళ్లుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీరుపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చింది శివ‌సేన‌. ఆ పార్టీ ప‌త్రిక సామ్నాలో కూడా… ప్ర‌ధాని నిర్ణ‌యాల‌పై తీవ్రంగా విమ‌ర్శించిన సంద‌ర్భాలున్నాయి. దీంతో, మ‌హారాష్ట్రలో భాజ‌పా, శివ‌సేన‌ల మ‌ధ్య పొత్తు కొన‌సాగింపు దాదాపు క‌ష్ట‌సాధ్య‌మే అన్న‌ట్టుగా క‌నిపించేది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా వాతావ‌ర‌ణం మారిపోయింది. భాజ‌పాతో సీట్ల సర్దుబాటుకి శివ‌సేన సిద్ధ‌మైంది. త‌మ‌వి హిందుత్వ పార్టీల‌నీ, పాతికేళ్లుగా పొత్తు కొన‌సాగుతోంద‌నీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాజ‌పా 25 సీట్లు, తాము 23 సీట్ల‌లో పోటీకి అనుగుణంగా స‌ర్దుబాటు చేసుకుంటున్న‌ట్టుగా సీఎం దేవేంద్ర ప‌డ్న‌వీస్ ప్ర‌క‌టించారు. అయితే, భాజ‌పా మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన శివ‌సేన ఇప్పుడు త‌గ్గిన‌ట్టా..? విమ‌ర్శించిన‌వారిని కూడా త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో భాజ‌పా నెగ్గిన‌ట్టా..?

శివ‌సేన కూడా మ‌తత‌త్వ పార్టీ కావ‌డంతో అటు ఎన్సీపీతో క‌లిసే అవ‌కాశం లేదు. కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు అనేదీ సాధ్యం కాదు. ఆ పార్టీకి పొత్తు అంటే… అది భాజ‌పాతోనే అవ‌కాశం ఉంది. అయితే, ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరినా… ఎన్నిక‌ల త‌రువాతి ప‌రిస్థితులు కొంత త‌మ‌కు అనుకూలిస్తే, చ‌క్రం తిప్ప‌డానికి శివ‌సేన సిద్ధ‌మౌతుంది అన‌డంలో సందేహం లేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత‌… భాజ‌పాకి బొటాబొటీ మెజారిటీ వ‌స్తే… ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీని మార్చాలనే డిమాండ్ ను శివ‌సేన తెరమీదికి తెచ్చే ఆస్కారం క‌చ్చితంగా ఉంది. ఇంకోప‌క్క‌, అదే రాష్ట్రం నుంచి ఎన్డీయే ప్ర‌ధాని అభ్య‌ర్థిగా నితిన్ గ‌ట్క‌రీ పేరు కూడా ఈ మ‌ధ్య తెర మీదికి వ‌చ్చిన సంద‌ర్భం తెలిసిందే. అలాంటివారికి మద్దతు ప్రకటించే ఆలోచనా శివసేనకి లేదనీ అనలేం.

ఒక‌వేళ ఎన్డీయే కూట‌మి కంటే, భాజ‌పా వ్య‌తిరేక పార్టీల కూట‌మికి కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటు స్థాయి ఫ‌లితాలే ఎన్నిక‌ల్లో ల‌భిస్తే… ప‌రోక్షంగా అటువైపూ శివ‌సేన మొగ్గుచూపే అవ‌కాశం ఉంది. ఎందుకంటే, ప్ర‌ధాని మోడీ విష‌యంలో శివ‌సేన కొంత అసంతృప్తిగా ఉంద‌నేది వాస్త‌వం. కాబ‌ట్టి, ప్ర‌స్తుతం భాజ‌పాతో సీట్ల స‌ర్దుబాటును, ఆ పార్టీకి శివ‌సేన త‌లొంచేసిన పరిస్థితిగా విశ్లేషించుకోలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close