ప్రొ.నాగేశ్వర్: ఆర్టీసీకి నష్టాలు ఎవరి వల్ల..?

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొద్దిలో తప్పిపోయింది. జీతాలు పెంచాలని కార్మికులు చేసిన ఆందోళనపై ప్రభుత్వం కాస్తంత సీరియస్‌గా స్పందించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే జీతాలు ఎలా పెంచుతారని ప్రశ్నించింది. ఆర్టీసీకి ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఉందని.. ఇప్పుడు ఏడాదికి రూ. 7వందల కోట్ల రూపాయల నష్టాలొస్తున్నాయని ప్రభుత్వం లెక్క చెప్పింది. ఈ నష్టాలకు కారణం ఎవరు..? ఆర్టీసీనా..? ఉద్యోగులా..? ప్రభుత్వమా..?

ఏడాదికి ఆర్టీసీ కట్టే ఎంవీ టాక్స్ రూ. 210 కోట్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. టీఎస్ఆర్టీసీ ఇప్పటి వరకు ప్రభుత్వం మోటార్ వెహికల్ ట్యాక్ కింద దాదాపుగా రూ. 816 కోట్ల రూపాయలు కట్టింది. ఏ విధంగా చూసుకున్నా..ఇది ఏడాదికి రూ. 200 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్లు.. ఏడాదికి టీఎస్ఆర్టీసీ ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వస్తే.. అందులో 200 కోట్లు.. ప్రభుత్వానికి ఆర్టీసీ కడుతున్న పన్నే కదా. ఆర్టీసీ అనేది పబ్లిక్ టాన్స్ పోర్ట్ సిస్టమ్. ప్రజోపయోగం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వీసు. దీనిపై మోటార్ వెహికల్ ట్యాక్స్ వేయడం తప్పు. మరే ఇతర పబ్లిక్ సర్వీస్ పైనైనా అంటే.. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం పెడుతున్న ఖర్చుపై పన్ను విధిస్తున్నారా..? లేదుగా..! మరి ఆర్టీసీపైనే పన్ను ఎందుకు. ఆర్టీసీ అనేది ప్రజారవాణా కోసం ఉన్న సంస్థ. వ్యాపారం కోసం కాదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియక కాదు. లాభం వచ్చే రూట్లలో పన్ను విధించినా ఓ రకంగా సమర్థనీయమే కావొచ్చు. లాభాలొస్తున్నాయి కాబట్టి పన్ను కట్టమని అడగవొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తప్పసరిగా ప్రభుత్వ బాధ్యతగా… తిప్పే సర్వీసులకు నష్టాలొస్తున్నాయి. ఇది ప్రభుత్వ బాధ్యత . వీటిపైనా పన్ను విధించడం కరెక్ట్ కాదు. నిజానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచీ కార్మికులు.. ఆర్టీసీకి మోటార్ వెహికల్ టాక్స్ ను తీసేయమని కోరుతున్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

కొనుగోలు చేసే డీజీల్ పై ఆర్టీసీ కట్టే పన్ను రూ. 590 కోట్లు
ఆర్టీసీ బస్సులు లక్షల లీటర్ల డీజిల్ కొనుగోలు చేస్తూంటాయి. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్ పై.. ఏడాదికి రూ.590 కోట్ల రూపాయల పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్నాయి. అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మీద నుంచి కూడా ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇందులో కేంద్రం కొంత.. రాష్ట్రం కొంత వసూలు చేస్తున్నాయి. డీజిల్ పై లీటర్ కు సగటున రూ.39 టాక్స్ లు వసూలు చేస్తున్నారు. పన్నుల్లేకుండా.. ఆర్టీసీకి డీజిల్ సరఫరా చేస్తే… ఏడాది రూ. 590 కోట్లు మిగులుతాయి. అంటే… ఎంవీ టాక్స్, డీజిల్ పై పన్నును తీసేస్తే.. ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడినట్లే.

డీజిల్ ధర పెరుగుదల వల్ల రోజుకు రూ. కోటి 20 లక్షల భారం..!
నాలుగేళ్ల కిందట..తెలంగాణ ఏర్పడినప్పటి డీజిల్ ధరతో పోలిస్తే… ఇప్పుడు డీజిల్ ధర దాదాపుగా ఇరవై ఐదు రూపాయలు పెరిగింది. ఆర్టీసీ రోజుకు సగటున 36 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడుపుతుంది. ఈ నాలుగేళ్లలో రేట్ల పెరుగుదల వల్ల కిలోమీటర్ కు రూ.5 చొప్పున భారం ఆర్టీసీపై పడింది. అంటే రోజుకు రూ. కోటి ఇరవై లక్షల రూపాయలు ఆర్టీసీపై భారం పడింది. ఒక వేళ కేంద్రం పన్నులు పెంచకుండా ఉండి ఉంటే… ఆర్టీసీకి రోజుకు రూ. కోటి ఇరవై లక్షల రూపాయలు మిగులు ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. డీజిల్‌పై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు పెంచకుండా ఉండి ఉంటే.. ఈ నష్టం వచ్చేదే కాదుగా…!

ఆర్టీసీకి ఇవ్వాల్సిన ప్రభుత్వ రాయితీ నిధులు రూ. 1700 కోట్లు..!
ప్రభుత్వ వివిధ వర్గాలకు ఆర్టీసీ తరపున రాయితీలిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు, జర్నలిస్టులు అనే వివిధ వర్గాలకు రాయితీలిస్తోంది. ఈ రాయితీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి నాలుగేళ్లలో రూ. 2200 కోట్లు రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది రూ. 500 కోట్లు మాత్రమే. అంటే ఇంకా పదిహేడు వందల కోట్లు రావాలి. ఈ మొత్తం ఇస్తే… అప్పుడు పదమూడు వందల కోట్లు మాత్రమే ఉంటుంది. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా.. బ్యాంకుల నుంచి ఆర్టీసీకి ఇప్పించిన అప్పులపై వడ్డీ కూడా ఆర్టీసీతో కట్టిస్తోంది. దీంతో ఆర్టీసీపై మరింత భారం పెరుగుతోంది.

ఆదాకి.. ఆదాయానికి అనేక మార్గాలు..!
ఆర్టీసీ బస్సుల కోసం ఏటా కోట్ల రూపాయల్లో స్పేర్ పార్ట్స్ కొనుగులు చేస్తుంది. వీటిపై వసూలు చేసే జీఎస్టీనే దాదాపుగా రూ. 100 కోట్ల పైమాటే. అలాగే ఆర్టీసీ బస్సులకు కావాల్సిన టైర్ల కోసం.. భారీగా వెచ్చిస్తూంటారు. సొంత టైర్ల ఉత్పత్తిని ఆర్టీసీ ఎందుకు చేపట్టదో ఎవరికీ అర్థం కాదు. వాస్తవానికి ఎన్టీఆర్ హయాంలోనే మంగళగిరిలో టైర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన మందుకెళ్లలేదు. అలాగే స్పేర్ పార్ట్స్ కోసం కోట్లు వెచ్చించేబదులు ఒకేసారి ఉత్పాదక సంస్థను పెట్టుకుంటే… సంస్థకు వేరే ఆదాయం కూడా లభిస్తుంది. అలాగే ఆర్టీసీ డీజిల్ ను రీటైల్ గా కనుక్కుంటోంది. రైల్వేను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా గుర్తించి డీలర్ కమిషన్ లేకుండా… సరఫరా చేస్తున్నారు. ఆర్టీసీకి మాత్రం డీలర్ షిప్ గుర్తింపు ఇవ్వడం లేదు. ఇలా ఇచ్చినా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి మిగులుతుంది. ఇవే కాక.. ఆర్టీసీ ఆస్తులను కమర్షియల్ గా ఉపయోగంచుకున్నా..కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.

ప్రభుత్వాల వల్లే ఆర్టీసీ నష్టాలు
ఈ వివరాలన్నింటినీ చూస్తే.. తెలంగాణ ఆర్టీసీ నష్టాలు ఎవరి వల్ల వస్తున్నాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పన్నుల వల్లే .. ఆర్టీసీకి నష్టం వస్తోంది కానీ… కార్మికుల వల్ల కాదు. ఆర్టీసీని లాభాల్లోకి తేవాలంటే.. ప్రభుత్వం పన్నులు ఉపసంహరించుకుంటే చాలు. కానీ దీనికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close