అత్తారింటికి పోలిక‌లెన్నో..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రెండు సినిమాలొచ్చాయి. జ‌ల్సా హిట్ట‌య్యింది. అత్తారింటికి దారేది రికార్డులు సృష్టించింది. కాబ‌ట్టి మూడో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే… ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌లు ఇంకా అత్తారింటికి హ్యాంగోవ‌ర్ లోనే ఉన్న‌ట్టున్నారు. ఎందుకంటే.. అత్తారింటికి మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌డానికి సేమ్ టూ సేమ్ అత్తారింటికి దారేది ఫార్ములాలోనే న‌డుస్తున్నారు. అత్తారింటికిదారేదికీ, కొత్త సినిమాకీ చాలా పోలిక‌లు క‌నిపిస్తున్నాయి.

అత్తారింటికి దారేదిలానే ఈ సినిమాకీ ఓ సాఫ్ట్ టైటిల్ పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం.

అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ పాట పాడాడు. సేమ్ ఈ సినిమాలోనూ ప‌వ‌న్‌తో ఓ పాట పాడించ‌డానికి త్రివిక్ర‌మ్ సిద్ధ‌మ‌య్యాడు.

అత్తారింటికి దారేదిలో ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు త్రివిక్ర‌మ్‌. ఓ స్టార్ హీరో సినిమా క్లైమాక్స్‌ని డైలాగులతో ముగించ‌డం కొత్త‌గా అనిపించింది. ఆ క్లైమాక్స్ ప్ల‌స్‌గా మారింది. కొత్త సినిమాలోనూ అలాంటి ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ ఉండ‌బోతోంది.

అత్తారింటికి దారేదిలో కీల‌క‌మైన పాత్ర‌కు బొమ‌న్ ఇరానీని తీసుకొచ్చారు. ఇప్పుడు బొమ‌న్‌కి ఈ సినిమాలో చోటు ద‌క్కింది.

అత్తారింటికి దారేతిలో న‌దియాకి ఓ కీ రోల్ ఇచ్చారు. ఆస్థాయి ఉన్న పాత్ర‌లో ఖుష్ బూ క‌నిపించ‌బోతోంది.

ఇలా.. ప‌వ‌న్ కొత్త సినిమాలో అత్తారింటికి పోలిక‌లు చాలా చాలా క‌నిపిస్తున్నాయి. అలాంట‌ప్పుడు ఈ సినిమాకి అత్తారింటికి దారేది 2 అనే పేరు పెట్టేస్తే స‌రిపోతుందేమో…??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.