పులివెందులలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డి. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ రెడ్డి పులివెందులను వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబానికే అప్పగించారు. నిజానికి వైఎస్ ఉన్నప్పుడు కూడా వైఎస్ భాస్కర్ రెడ్డే అన్నీ చూసుకునేవారు. ఆయనే శివశంకర్ రెడ్డి లాంటి వాళ్లను పక్కన పెట్టుకుని పులివెందుల మొత్తాన్ని భయం అనే కోణంలో తమ చుట్టూ ఉంచుకునేవారు. అయితే ఆయన వయసు మీద పడే కొద్దీ.. ఆయన కొడుకైన అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తున్నా.. ఆ స్థాయిలో భయపెట్టి అందర్నీ తన చుట్ట ఉంచుకోవడంలో అవినాష్ రెడ్డి ఫెయిలయ్యాడు.
జగన్ రెడ్డి.. అవినాష్ రెడ్డిని గట్టిగా నమ్మారు. పులివెందుల కోటకు బీటలు పడకుడా చూసుకుంటారని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. నిజం చెప్పాలంటే పులివెందుల ఓటర్లకు.. జగన్ రెడ్డికి నేరుగా అనుబంధమే లేదు. ఆయన పేరుకే ఎమ్మెల్యే. ఆరు నెలలకోసారి రెండు, మూడు సార్లు వచ్చి .. సెలక్టివ్ గా కొంత మందితో మాట్లాడి వెళ్తిపోతూంటారు. ఓటర్లతో డైరక్ట్ టచ్ ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి కోసం.. అవినాష్ రెడ్డి మాత్రమే తిరుగుతూ ఉంటారు. తనతో చెబితే జగన్ తో చెప్పుకున్నట్లేనని అవినాష్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూంటారు.
అయితే అవినాష్ రెడ్డి తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామాలకు ఏ పనులు చేయకపోవడం.. ఆయనతో పాటు తిరిగే కొంత మంది మాత్రమే డబ్బులు సంపాదించుకోవడం.. మిగతా అందర్నీ భయపెట్టి కంట్రోల్ లో ఉంచాలనుకోవడంతో అసలు సమస్య ప్రారంభమయింది. ఎప్పుడు స్వేచ్ఛ వస్తుందా అని అక్కడి జనం ఎదురు చూశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ కే పరిమితం కావాల్సి రావడం.. శివశంకర్ రెడ్డి లాంటి వాళ్లు బెదిరింపులకు భయపడేవారు లేకపోవడంతో.. పులివెందుల చేజారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జడ్పీటీసీనే కావొచ్చు.. రేపు ఎంపీపీ.. తర్వాత మున్సిపాలిటీ.. తర్వాత నియోజకవర్గం కూడా జారిపోతుంది. క్రెడిట్ అంతా అవినాష్ రెడ్డికే .